• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ సమయంలో కృంగిపోయాను: దృఢ సంకల్పంతోనే కోవిడ్ పై విజయం సాధించా : మలైకా

|

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహిస్తారు. ఇక హీరోయిన్ల విషయమైతే చెప్పక్కర్లేదు. 45 ఏళ్లు దాటిని వారి వయసు కనిపించకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడతారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ పై ఎక్కువగా ఫోకస్ చేసి మరింత కాలం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేందుకు తాపత్రయపడతారు. ఇక కరోనా కాలంలో కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మహమ్మారికి పలువురు సినీ ప్రముఖులు బలయ్యారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అలా కరోనా పై విజయం సాధించిన వారిలో బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా కూడా ఉంది. ఆమె వయస్సు 47 ఏళ్లు. ఈ వయస్సులో కూడా ఆమె చాలా చలాకీగా కనిపిస్తూ స్టెప్పులు వేస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తోంది.

మలైకా అరోరా కరోనా బారిన పడ్డాక ఎలా గట్టెక్కిందో చెబుతూ ఇన్స్‌టాగ్రామ్‌లో తన కథను వివరించింది. తాను కరోనాను జయించగలిగానంటే అదృష్టం అనేది చాలా తక్కువ పాత్ర పోషించిందని..దాన్నుంచి బయటపడేందుకు తాను స్వతహాగా చాలా నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఉన్నట్లు చెప్పింది. గతేడాది సెప్టెంబర్ 5వ తేదీ కరోనాబారిన పడ్డట్లు చెప్పిన మలైకా... రోగనిరోధక శక్తి ఉన్నట్లయితే ఫర్వాలేదు కానీ అదే లేదంటే ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. తన విషయంలో రెండు అడుగులు వేయాలంటే కూడా చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది మలైకా. కనీసం తన గదిలోని కిటికీ దగ్గరకు వెళ్లి కూడా నిల్చోలేని పరిస్థితి తనదని వివరించింది. ఆ సమయంలో బరువు పెరిగినట్లు, శక్తి కోల్పోయినట్లు, ముఖ్యంగా కుటుంబానికి, స్నేహితులకు దూరమైనట్లు చెప్పింది.

Stories of Strength:This is how Malaika turned victorious over Covid

చివరిగా సెప్టెంబర్ 26వ తేదీన కరోనా టెస్టు చేయించుకోగా తనకు నెగిటివ్ వచ్చిందని పేర్కొంది.కానీ నీరసం బలహీనత అనేది ఇంకొంత కాలం ఉన్నిందని చెప్పింది. అయితే తన శరీరం తనకు సహకరించకపోవడంపై తనలో నిరాశ నెలకొందని వెల్లడించింది. ఇక కరోనా నుంచి కోలుకున్న తర్వాత వర్కౌట్స్ చేయడం ప్రారంభించినా సరిగ్గా చేయలేకపోయేదాన్నని గుర్తుచేసుకుంది. అయితే రెండో రోజు నిద్రలేసి ఎలాగైనా సరే వర్కౌట్స్ చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చింది. అలాంటి బలమైన సంకల్పంతో వర్కౌట్స్ చేస్తూ చేస్తూ కరోనాకు ముందు తను ఎలాగైతే ఉండేదో ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేవని ఇప్పుడు భౌతికంగా మానసికంగా చాలా బలంగా ఉన్నట్లు పేర్కొంది.

  Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !

  ఇక ఈ రోజు ఆ మహమ్మారిపై విజయం సాధించి బలంగా నిలబడ్డానంటే కారణం సంకల్ప బలమే అని మలైకా చెప్పుకొచ్చింది. ఆరోగ్యం సరిగ్గా లేదని మనసుకు తెలిసనా... తప్పకుండా నయమవుతుందన్న సంకల్పమే సగం బలాన్ని ఇచ్చిందని చెప్పింది. ఆ సమయంలో తనకు అండగా నిలిచి తనను ప్రోత్సహిస్తూ వచ్చిన వారందరికీ మలైకా కృతజ్ఞతలు తెలిపింది. తనలానే ప్రపంచం కూడా కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పింది మలైకా.

  English summary
  Bollywood actress Malaika Arora shared her experience fighting Covid on instagram.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X