వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో తుపాను, కన్యాకుమారి అతలాకుతలం, నలుగురు మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Weather Update : Cyclone Ockhi, heavy rainfall over Kerala

చెన్నై: తమిళనాడును మరో సారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు లక్షద్వీప్ (లక్ష ద్వీపములు)లో భారీ వర్షాలు పడుతాయని, తుపాను వస్తోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కన్యాకుమారి జిల్లా అతలాకుతలం అయ్యింది.

గురువారం నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో పాటు దక్షిణ తమిళనాడులోని సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. కన్యాకుమారిలో నలుగురు మరణించినట్లుగా సమాచారం.

 కన్యాకుమారిలో హై అలర్ట్

కన్యాకుమారిలో హై అలర్ట్

తమిళనాడులో ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం కన్యాకుమారిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కన్యాకుమారిలో పర్యాటకులు సముద్రంలో విహరించకుండా నిషేధం విదించారు. కన్యాకుమారి బీచ్ లో ఈత కొట్టడానికి వీల్లేదని అధికారులు ఆంక్షలు విధించారు.

 తుపాను దెబ్బకు కన్యాకుమారి!

తుపాను దెబ్బకు కన్యాకుమారి!

తుపాను దెబ్బకు కన్యాకుమారి జిల్లా ప్రజలు హడలిపోయారు. గురువారం మద్యాహ్నం విపరీతమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందల కిలోమీట్ల వేగంతో వస్తున్న గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోయాయి.

రైళ్లు, వాహన సంచారం బంద్

రైళ్లు, వాహన సంచారం బంద్

తుపాను కారణంగా కన్యాకుమారితో సహ ఆ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి నాగర్ కోవిల్, తివేండ్రం వైపు వెళ్లే బస్సులు, రైళ్ల సంచారం పూర్తిగా నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో చేట్లు కుప్పకూలడంతో అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి.

చెన్నైలో అప్రమత్తం

చెన్నైలో అప్రమత్తం

తమిళనాడు రాజధాని చెన్నైలో నవంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు పడ్డాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న చెన్నై నగర ప్రజలు మళ్లీ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో హడలిపోతున్నారు. చెన్నైలో ఓ మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి.

తుపాన్, 210 కి.మీ వేగం

తుపాన్, 210 కి.మీ వేగం

శ్రీలంక నుంచి ఇప్పటికే 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, కన్యాకుమారిలో 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి తుపానుకు దారి తీస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సముద్రంలో చేపలు పట్టడానికి ఎవ్వరూ వెళ్లకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

 చెన్నైకి తుపాను దెబ్బ ?

చెన్నైకి తుపాను దెబ్బ ?

చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లోని మురికివాడలలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షింత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో భారీ వర్షాల వలన ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

 తిరుపతి, బెంగళూరుకు తుపాను దెబ్బ

తిరుపతి, బెంగళూరుకు తుపాను దెబ్బ

తమిళనాడులో తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నగరం, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం మీద పడింది. గురువారం ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. తిరుపతి, బెంగళూరులో పొగ మంచు కమ్ముకుంది. పగటి పూట ఎక్కవ చలి ఉండటంతో పిల్లలు, వృద్దులు బయటకు రావాలంటే హడలిపోతున్నారు.

English summary
India Met Department (IMD) has issued a tropical cyclone formation alert to the West of Sri Lanka and to the South of Kanyakumari at the tip of peninsular India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X