వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంభకోణాలు: ధర్మతేజ, 'సత్యం' రాజు నుంచి విజయ్ మాల్యా దాకా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎంచక్కా లండన్ పారిపోయిన విజయ్ మాల్యా అప్పట్లో టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని, గాంధీజీ ఉపయోగించిన కళ్లద్దాలు, చెప్పులు, పాకెట్‌ వాచ్‌, ప్లేట్‌‌లను వేలం ద్వారా కొనుగోలు చేసి తిరిగి భారత్‌కు తీసుకురావడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు.

జనతా పార్టీ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యా దేశ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. రాజకీయంగా తన పలుకుబడిన పెంచుకునేందుకు, తన దేశభక్తిని చాటి చెప్పేందుకు భారత్‌కు చెందిన ప్రముఖుల వస్తువులను వేలం ద్వారా భారీ మొత్తాలకు కొనుగోలు చేసేవాడని చెబుతున్నారు.

2003లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్‌ వీరోచిత ఖడ్గాన్ని దాదాపు 1.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. సుమారు 200 ఏళ్ల తర్వాత ఆ ఖడ్గాన్ని తిరిగి భారత్‌కు రప్పించాడు. అప్పట్లో అది ఓ సంచలనాన్ని సృష్టించింది.

ఆ తర్వాత మైసూర్‌లో జరిగిన టిప్పు వార్షికోత్సవాల్లో ఆ ఖడ్గాన్ని ప్రజల కోసం సందర్శనకు ఉంచాడు. రాజకీయంగా తన సత్తా చాటేందుకే విజయ్ మాల్యా ఇదంతా చేస్తున్నాడని అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రవిమర్శలు చేశాయి. ఆ తర్వాత 2009లో గాంధీజీకి చెందిన వస్తువులను 12 కోట్ల రూపాయలకు దక్కించుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ఈ వేలంలో గాంధీజీ వస్తువులు రాకుండా ఆపేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ వేలంలో ఎవరూ ఊహించని మొత్తాన్ని కోట్ చేసి గాంధీజీ వస్తువులను సొంతం చేసుకున్నాడు.

Story behind Vijay Mallya buys Tipu Sultan's legendary sword

నిజానికి భారత్‌లో అమ్ముడయ్యే బీర్లలో యాభై శాతం మార్కెట్ విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్‌కు చెందిన కింగ్‌ఫిషనర్‌ బీర్లదే. ఒక్క భారతలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో కింగ్‌ఫిషనర్‌ బీర్లకు మంచి డిమాండ్ ఉంది. తన తండ్రి చనిపోయినప్పుడు అప్పట్లో యునైటెడ్ బ్రూవరీస్ అనేది 10 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యం.

ఆ తర్వాత ఆ సంస్ధకు సీఈఓగా బాధ్యతలను స్వీకరించిన విజయ్ మాల్యా తదుపరి రెండు దశాబ్దాల్లో బ్రూవరీస్ మార్కెట్ విలువను 60వేల కోట్లకు పెంచారు. యునైటెడ్‌ బ్రూవరీస్‌ విజయాల సాధించిన విజయ్ మాల్యా అదే విధంగా భారత విమానయాన రంగంలో అద్భుతాలు చేద్దామనుకుని కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ స్థాపించారు.

అయితే 2005లో ప్రవేశపెట్టిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాల్యాను ఆర్ధికంగా బాగా దెబ్బతీసింది. అతి తక్కువ కాలంలోనే నష్టాలను చవిచూసిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేక మూసేయ్యాల్సిన పరిస్థితి తలెత్తింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం మాల్యా బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 9వేల కోట్ల రుణాలను కూడా తిరిగి చెల్లించలేకపోయాడు.

బతికినంతకాలం రాజులా బతుకాలనేది విజయ్‌ మాల్యా సిద్ధాంతం. కింగ్‌ఫిషర్ బ్రాండ్‌కు విజయ్ మాల్యా ఇచ్చిన నిర్వచనం 'కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైమ్స్‌'. ఖరీదైన, ఫ్లాషీ డ్రెస్‌లు.. ఎప్పుడూ చెంత ఉండే ఆర్మ్‌ క్యాండీల్లాంటి ముద్దుగుమ్మలు.
కానీ ఇప్పుడు తాను పుట్టిన దేశాన్ని వదిలి ప్రస్తుతం ఎక్కడో లండన్‌లో తలదాచుకుంటున్నాడు.

అంతేనా సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసింది. ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో మాల్యాకు ఈడీ శుక్రవారం సమన్లు జారీ చేసింది. పుట్టుకతోనే ధనవంతుడైన విజయ్ మాల్యా ఈరోజు యావత్ భారతావని ముందు తప్పు చేసినవాడిగా నిలబట్టాడు. దీనికంతటికి కారణం మాల్యా విలాసవంతమైన జీవితమేనా?

ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో జయంతి ధర్మతేజ, తర్వాత సత్యం రామలింగరాజు, ఇప్పుడు విజయ్‌ మాల్యా.. కార్పొరేట్‌ కుంభకోణాలతో వార్తల్లో నిలిచిన ప్రముఖ భారతీయులు. మొదటి ఇద్దరు తెలుగు వాళ్లే కాగా విజయ్ మాల్యా మాత్రం పక్క రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన వ్యక్తి.

విలాస పురుషుడైన విజయ్ మాల్యా 1955 డిసెంబర్‌18న కర్ణాటకలోని బంట్వాల్‌ అనే ఓ చిన్న పట్టణంలో విఠల్‌ మాల్యా, లలిత దంపతులకు జన్మించారు. తండ్రి మార్గదర్శకత్వంలో బిజినెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన మాల్యా తొలినాళ్లలో అనుభవం కోసం షాజహాన్‌పూర్‌లో క్లర్క్‌గా పనిచేశారు.

అనంతరం తండ్రి చనిపోవడంతో తన 27వ ఏట యునైటెడ్‌ బ్రేవరీస్‌ గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తరచుగా విమాన ప్రయాణాలు చేసే మాల్యా ఎయిర్‌ హోస్టెస్‌ సమీరా త్యాబ్జీని 1986లో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ
కలిగిన సంతానమే సిద్ధార్ద్‌ మాల్యా. అయితే వారి కాపురం ఎక్కువ కాలం సాగలేదు.

సమీరతో విడాకులు తీసుకున్న మాల్యా.. 1993లో చిన్న నాటి నేస్తం రేఖను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే రేఖకు రెండు సార్లు పెళ్లయింది. మాల్యాను వివాహం చేసుకునే సమయానికే ఆమెకు ముగ్గురు పిల్లలు. మాల్యా, రేఖ వివాహం చేసుకున్నాక వారికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వారి పేర్లు లియానా, తాన్య.

English summary
Story behind Vijay Mallya buys Tipu Sultan's legendary sword.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X