వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథలు..పాత తరానికి.. నవ తరానికీ వారధులు: వంకాయల రుచిపై కథ: మన్ కీ బాత్‌లో మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కథలకు ఉన్న ప్రాధాన్యత గురించి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదివరకు బొమ్మల కొలువుల గురించి మాట్లాడిన ఆయన ఈ సారి కథలు, వాటికి ఉన్న ప్రాధాన్యత గురించి వివరించారు. మన్ కీ బాత్ సెప్టెంబర్ ఎడిషన్‌ ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్స్ గురించి మోడీ మాట్లాడారు. బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

శ్రీకృష్ణ దేవరాయల గురించి బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ ప్రతినిధులు అపర్ణ ఆత్రేయ, లావణ్య ప్రసాద్ తదితరులు కథా రూపంలో వివరించారు. కృష్ణదేవరాయలు, తెానాలి రామకృష్ణ, బావర్‌పై రూపొందించిన కథను వారు వినిపించారు. వంకాయల రుచులు, భారతీయ వంటకాల్లో దానికి ఉన్న ప్రాధాన్యత గురించి కథగా వివరించారు. పౌష్టికాహార మాసోత్సవ సమయంలో వంటకాల గురించి కథా రూపంలో తాను వినడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు.

Story telling: Where there is a soul, there is a story, says PM Modi in Mann Ki Baat

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్‌డౌన్ సమయంలో 130 కోట్ల మంది దేశ ప్రజలు ఇంటి పట్టున గడిపారని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటారని అన్నారు. వయసు మళ్లిన కుటుంబ సభ్యులతో ఓ అనుబంధాన్ని పునరుద్ధరించుకుని ఉంటారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. కథలు.. కుటుంబ సభ్యుల మధ్య ఓ కనిపించని సూత్రంతో కట్టిపడేస్తాయని ప్రధాని అన్నారు. పాత తరానికి, నవ తరానికీ వారధులుగా పనిచేస్తాయని చెప్పారు.

కథలు అనేవి పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీస్తాయని, వారి కాల్పనిక శక్తిని రెట్టింపు చేస్తాయని మోడీ అన్నారు. ఓ ఖజానాలా అవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు. కథలు చెప్పుకోవడం వల్ల తెలియని ఓ నూతనోత్తేజం మనలను ఉత్తేజితులను చేస్తుందని చెప్పారు. కథలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తానని మోడీ చెప్పుకొచ్చారు. పశ్చిమాఫ్రికాలోని మాలీకి చెందిన సేదు దంబెలే గురించి మోడీ ప్రస్తావించారు.

Recommended Video

PM Modi Questions United Nations ఐరాసపై నిప్పులు చెరిగిన మోదీ || Oneindia Telugu

ఆయన హిందీలో మాట్లాడతారని మోడీ తెలిపారు. సేదె దంబెలే హిందీ భాషలోనే పరిచయం చేసుకున్నారు. ఆయన గురించి మోడీ వివరించారు. హిందీ, మాలీ అధికారిక భాష బంబారా గురించి కామెంటరీని వినిపించడంలో సిద్ధహస్తుడని చెప్పారు. ప్రతి ఆదివారం ఆయన రేడియో ద్వారా బాలీవుడ్ సినిమాకు సంబంధించిన కథనాన్ని ఆయన వివరిస్తుంటారని మోడీ వివరించారు. కథలు చెప్పడం ఓ అద్భుతమైన కళ అని, దాన్ని విస్మరించకూడదని చెప్పారు.

English summary
History of stories is as ancient as the human civilization itself. 'Where there is a soul, there is a story'.... In India, there has been a rich tradition of storytelling. We're proud to be denizens of land that nurtured tradition of Hitopadesha and Panch Tantra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X