వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:పోలీసులతో వలసకూలీల ఘర్షణ, సొంత రాష్ట్రం వెళతామని పట్టు, లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు..

|
Google Oneindia TeluguNews

లాన్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలసకూలీలు సొంత రాష్ట్రం వెళ్లేందుకు పెట్టేబెడ సర్దుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారిని తరలించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సోమవారం సూరత్‌లో వలసకూలీల ఆందోళన హింసాత్మకంగా మారింది. తమను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని కోరడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక్కడ వరసగా నాలుగోరోజు ఆందోళన చేయడం విశేషం. సూరత్‌లో డైమండ్, టైక్స్ టైల్ వ్యాపారం జరుగుతుంటుంది.

ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: 1650కి చేరికఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: 1650కి చేరిక

సూరత్‌లోని కడడోర, వరేలి ప్రాంతంలో వందలాది మంది వలసకూలీలు గూమిగూడారు. పలాన్ పూర్ పాటియాలో కూడా వలసకూలీలు రోడ్లపైకి వచ్చి మరీ నినాదాలు చేశారు. తమను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి వలసకూలీలను తరలించే ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఇదే విషయం వారికి చెప్పి.. శాంతింపజేసే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ వారు వినిపించుకోలేదు పోలీసులతో గొడవకు దిగారు. దీంతో ఖాకీలు లాఠీలకు పని చెప్పారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Stranded migrant workers clash with police in Surat, demand to be sent home..

Recommended Video

Lockdown 3.0 : It's Pollution Time, Massive Traffic Jams On Roads In Amid Relaxations

ఇప్పుడే కాదు వారం రోజుల కింద కూడా దిందోలి ప్రాంతంలో వలసకూలీలు ఆందోళనకు దిగారు. వాహనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను ధ్వంసం చేశారు. ఆ రోజు కొందరు రాళ్లు రువ్వడంతో పోలీసులు గాయపడ్డారు. తర్వాత ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Violence erupted in Kadodara area of Surat after hundreds of migrant workers came out on roads as they demanded that they be sent back to their native places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X