వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Strawberry Moon 2021:జూన్ 24వ తేదీన ఆకాశంలో మరో అద్భుతం.. చంద్రుడు అలా: కానీ భారత్‌లో..!

|
Google Oneindia TeluguNews

ఈ మధ్యకాలంలో వినీలాకాశంలో ఎన్నో అద్బుతాలు చూశాము. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, సూపర్ మూన్, బ్లడ్ మూన్, సంపూర్ణ చంద్రగ్రహణం, రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం ఇలా ఎన్నో అద్భుతాలు నింగిలో కనువిందు చేశాయి. ఇక తాజాగా మరో అద్భుతం ఆకాశంలో కనువిందు చేయనుంది. అదే స్ట్రాబెర్రీ మూన్. జూన్ 24వ తేదీన స్ట్రాబెర్రీ మూన్ ఆకాశంలో కనిపిస్తుంది. సమ్మర్ సాల్స్‌టిస్ తర్వాత తొలిసారిగా పౌర్ణమి కనువిందు చేస్తుంది. ఆ రోజు చంద్రుడు నారింజ రంగులో కనిపించడం ప్రారంభమై.. ఆ తర్వాత క్రమంగా పసుపు రంగులోకి మారుతాడు. ఆరోజున చంద్రుడు సాధారణ పరిమాణం కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు. అయితే ఇది భూకక్ష్యకు సమీపంగా రావడంతో అలా కనిపిస్తుంది తప్పితే మే నెలలో కనిపించినట్లుగా దీన్ని సూపర్‌మూన్‌గా పరిగణించరు.

ఎండాకాలం ప్రారంభంలో ఒకసారి కనిపించి తర్వాత వసంతకాలంలో చివరిసారిగా పౌర్ణమి వస్తుంది. ఆ రోజున పసుపు రంగులో చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడు.ఉత్తర అర్థభూగోళంలోని ప్రాంతాల్లో జూన్ 21 నుంచి వేసవి కాలం ప్రారంభమైంది. ఇక జూన్ 24న కనిపించే చంద్రడికి స్ట్రాబెర్రీ మూన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అమెరికాలోని ఓ గిరిజన తెగకు చెందిన వారు పౌర్ణమి రోజునే స్ట్రాబెర్రీ పంట కోత కోస్తారు. అలా ఈ పౌర్ణమి రోజున కనిపించే నిండు చంద్రుడికి స్ట్రాబెర్రీ మూన్ అనే పేరు వచ్చింది. ఇక జూన్ నెలకు వివిధ దేశాల్లో పలు రకాల పేర్లున్నాయి. ఐరోపా దేశాల్లో దీనికి రోజ్ మూన్ అని పేరు. ఈ సమయంలో రోజా పూల పంట కోతకు వస్తుంది. ఇక ఉత్తర అర్థభూగోళ ప్రాంతంలో దీన్ని హాట్ మూన్ అని పిలుస్తారు. అంటే ఈ రోజు నుంచే అక్కడ వేసవికాలం ప్రారంభం అవుతుందని చెప్పుకునేందుకు గుర్తుగా ఇలా పిలుస్తారు.

 Strawberry Moon to be seen in the sky on 24th June, dont Miss this

ఈ స్ట్రాబెర్రీ మూన్ ఒక రోజు కంటే ఎక్కువగానే ఆకాశంలో కనిపించి కనువిందు చేస్తుంది. సాధారణ చంద్రడు ఒక రోజు కంటే ఎక్కువగా కనిపించడు. సమ్మర్ సాల్స్‌టిస్ మరియు ఈక్వినాక్స్ మధ్య మూడు సార్లు నిండు చంద్రుడు కనిపిస్తాడు.అయితే 2021లో మాత్రం నిండు చంద్రుడు నాలుగు సార్లు దర్శనమిస్తాడు. భూమి చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు చంద్రడు 29.5 రోజుల సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో చంద్రుడి ఆకారం మారుతూ వస్తుంది. అయితే సమ్మర్ సాల్స్‌టిస్ మరియు స్ట్రాబెర్రీ మూన్‌లు 20 ఏళ్లకోసారి కనువిందు చేస్తాయి. ఇక అంతరిక్షంలో జరిగే అద్బుతాలపై ఆసక్తి ఉన్నవారు స్ట్రాబెర్రీ మూన్‌ను జూన్ 24న చూడొచ్చు. మళ్లీ మరో నెలకు అంటే జూలై 24కు బక్‌మూన్ వస్తుంది. ఆ తర్వాత ఆగష్టు 22వ తేదీన స్టర్జియాన్ మూన్ వస్తుంది. చివరిగా హార్వెస్ట్ మూన్ అనేది సెప్టెంబర్ 20వ తేదీన వస్తుంది. ఇక పగలు రాత్రి ఒకే సమయంలో వచ్చే ఈక్వినాక్స్ సెప్టెంబర్ 22వ తేదీ వస్తుంది.

మొత్తానికి ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ చూడాలనుకునేవారు జూన్ 24వ తేదీ గురువారం రోజున మర్చిపోకుండా చూడండి. కానీ భారత్‌లో మాత్రం ఈ స్ట్రాబెర్రీ మూన్ కనిపించే అవకాశాలు లేవు.

English summary
Strawberry moon will be seen in the sky on June 24th this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X