వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎద్దు పేడలో ‘బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని!

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: ఓ ఎద్దు పేడ కోసం ఓ కుటుంబం ఎదురు చూస్తోంది. ఆ ఎద్దు ఎప్పుడు పేడ వేసినా.. వెంటనే తట్టలో ఎత్తి అందులో ఏమైనా ఉందా? అని వెతుకుతోంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఆ ఎద్దు ఆ కుటుంబానికి చెందిన ఒకరి బంగారు నగలు మింగిన నేపథ్యంలోనే వారు ఇలా చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

కూరగాయల బుట్టలో నగలు..

కూరగాయల బుట్టలో నగలు..

వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రం సిర్సా జిల్లా కలన్‌వాలీలో నివసిస్తున్న వ్యాపారి జనక్ రాజ్ భార్య, కోడలు శనివారం రాత్రి ఓ పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత తమ ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు నగలను తీసి.. కూరగాయల వ్యర్థాలు పడేసే బుట్టలో పెట్టారు. ఆ విషయం మరిచిపోయి మరుసటి ఉదయం కూరగాయలతోపాటు నగలను కూడా బయటపడేశారు.

గుర్తుకొచ్చి వెతికితే...

గుర్తుకొచ్చి వెతికితే...

కాసేపటికి తర్వాత బంగారు నగల విషయం గుర్తుకు వచ్చి అంతటా వెతికారు. చివరకు చెత్తబుట్టలో వేశామని గుర్తుకు రావడంతో ఆ చెత్త ఎక్కడ వేశారో అక్కడ వెతకడం ప్రారంభించారు. అప్పటిక ఓ ఎద్దు ఆ కూరగాయలను తినేసి వెళ్లిపోయింది. అయితే, గుమ్మం వద్ద ఒక చెవిపోగు మాత్రం లభించింది.

సీసీ కెమెరాల్లో కనిపించిన ఎద్దు..

సీసీ కెమెరాల్లో కనిపించిన ఎద్దు..


తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ చూసి.. వారు పాడేసిన కూరగాయలను ఓ ఎద్దు తిన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆ ఎద్దును స్థానికంగా వెతికి నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే కట్టేశారు. ఆ ఎద్దుకు బాగా గడ్డి, చెరుకు పిప్పి పెట్టారు. తమ బంగారు నగలు పేడలో ఏమైనా వస్తాయేమోనని ఇలా చేశారు. ఆ ఎద్దు పేడ వేసిన ప్రతిసారీ ఓ తట్టలో ఎత్తి వెతికారు.

పేడలో బంగారం కోసం పాట్లు...

పేడలో బంగారం కోసం పాట్లు...

ఇలా ఆ కుటుంబసభ్యులు చాలా సార్లు చేసినప్పటికీ ఆ ఎద్దు పేడలో మాత్రం వారి బంగారు నగలు దొరకలేదు. మూడు రోజులు గడిచినా బంగారు నగలు రాకపోవడంతో.. చివరకు పశువుల వైద్యులను కూడా సంప్రదించారు. అయితే, ఆ ఎద్దు ఒక వేళ బంగారు నగలను కూరగాయలతోపాటు తిన్నప్పటికీ వెంటనే బయటకి రాకపోవచ్చని.. సమయం పట్టవచ్చని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఆ కుటుంబసభ్యులు తమ నగల కోసం ఎదరుచూపులు చూడాల్సిన సమయం మరింత పెరిగినట్లయింది.

English summary
In a bizarre incident, a stray bull swallowed gold jewellery which was discarded accidentally, along with kitchen waste in Kalanwali town in Sirsa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X