వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 జిల్లాల్లో ఫుల్ లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ కూడా.. ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో మళ్లీ కరోనా వేవ్ మొదలైంది. గత 24 గంటల్లో 6 వేల 112 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ సోకిన 44 మంది చనిపోయారు. వైరస్ నుంచి 2159 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 75 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. అక్టోబర్ 30వ తేదీన 6 వేల కేసులు వచ్చాయి. ముంబైలో 823 కేసులు రికార్డు కాగా.. పుణెలో 1015 కేసులు వచ్చాయి.

మహారాష్ట్రలో 19 లక్షల పైచిలుకు మంది కరోనా సోకి కోలుకున్నారు. వీరిలో 2.48 శాతం మరణాలు ఉన్నాయి. రికవరీ అయితే 95.32 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం కోటి 55 లక్షల పైచిలుకు మందికి పరీక్షలు చేశారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. యవత్మాల్, అకొలా, అమరావతి జిల్లాల్లో భౌతిక దూరం, ఇతర నిబంధనలను కఠిన తరం చేశారు. రాష్ట్రంలో 8 జిల్లాల్లో 8 శాతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. పుణె, నాసిక్, నాగ్ పూర్, వార్వా, యవత్మాల్, అమరావతి, అకొలా, బుల్దానా ఉన్నాయి.

 strict social distancing norms imposed in Maharashtras 3 districts

కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే ప్రజా సామూహికంగా ఉండొద్దని చెప్పారు. యవత్మాల్, అమరావతి, అకొలాలో ఆదివారం 24 గంటలపాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ప్రజలు గ్యాదర్ అవడానికి పర్మిషన్ ఇవ్వొద్దని అధికారులు స్పష్టంచేశారు.

English summary
Maharashtra on Friday reported 6,112 fresh cases of coronavirus along with 44 more Covid-related deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X