వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్రాస్ ఘటనపై ప్రధాని మోడీ ఆరా..నిందితులపై కఠిన చర్యలు: యూపీ సీఎం యోగి

|
Google Oneindia TeluguNews

హత్రాస్ దళిత యువతి మృతిపై దుమారం రేగింది. అంత్యక్రియలపై కూడా రగడ నెలకొంది. ఘటనపై విపక్షాలు ఏకీపారేయడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. సిట్, ఫాస్ట్రాట్ కోర్టు కూడా ఏర్పాటు చేసింది. అయితే ఘటన గురించి ప్రధాని మోడీ కూడా ఆరాతీశారు. నిందితులను వదలొద్దని స్పష్టంచేశారు.

ఘటన గురించి తనతో ప్రధాని మోడీ మాట్లాడారని సీఎం యోగి ఆదిత్య నాథ్ ట్వీట్ చేశారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. నిందితులను వదలబొమని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

strictest of action to be taken culprits: UP CM Yogi Adityanath

ఇదిలాఉంటే మరోవైపు.. అంత్యక్రియలపై దుమారం చెలరేగింది. కుటుంబసభ్యులు లేరు అని.. విరుద్దంగా నిర్వహించారని కామెంట్ చేయగా జిల్లా కలెక్టర్ కామెంట్ చేశారు. మృతురాలి అంత్యక్రియలు జరిగే సమయంలో ఆమె తండ్రి, సోదరుడు ఉన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారని తెలిపారు. మృతురాలు ఉన్న వాహనం గ్రామానికి రాత్రి 12.45 గంటలకు చేరుకుందని తెలిపారు. రాత్రి 2.30 గంటలకు చేరుకుందని తెలిపారు.

Recommended Video

థాంక్యూ CM Jagan గారూ.. ఇది భారతీయుల కోరిక అంటూ Kamal Haasan ప్రశంస! || Oneindia Telugu

హత్రాస్ ఘటనపై యోగి సర్కార్ స్పందించింది. యువతిపై లైంగికదాడి ఘటనపై ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు వారంలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. ఆ తర్వాత విచారణ కోసం ఫాస్ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. దీంతో వేగంగా విచారణ జరిగి.. నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది.

English summary
Prime Minister Narendra Modi spoke to me over Hathras incident, he said that strictest of action be taken against the culprits UP CM Yogi Adityanath said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X