వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమల హాసన్ నాలుక కోయాలి..తమిళ్ మంత్రి

|
Google Oneindia TeluguNews

సినినటుడు ,ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ నాథూరాం పై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తమిళనాడు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర హిందుత్వ పార్టీలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. కమల్ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులే సినిమా తోపాటు ఇతర వర్గాలవారు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. కాగా ఆయనకు మద్దతుగా తమిళ కాంగ్రెస్ పార్గీ నిలుస్తోంది..

ఉగ్రవాదానికి మతం లేదు : వివేక్ ఒబేరాయ్

కమలహాసన్ చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులే కాకుండా సినిమా రంగానికి చెందిన వివేక్ ఒబేరాయ్ తీవ్ర అభ్యంతరం చేశారు. స్వతంత్ర్య భారత్ తొలి ఉగ్రవాది హిందువు నాధూరాం గాడ్సే అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపైను ట్విట్టర్ ద్వార వివెక్ ఒబెరాయ్ ఖండించారు. కమల్ ఒక నటుడు, కళలకు మతంతో సంబంధం లేనట్లుగానే ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు,ఈనేపథ్యంలోనే గాడ్సే ఓ తీవ్రవాది అని చెప్పారు కాని హిందు అనే పదం ప్రత్యేకంగా ఎందుకు వాడరంటూ ప్రశ్నించారు. ముస్లింల ఓట్లు రాబట్టుకోవడం కోసం ఇలాంటీ వ్యాఖ్యలు చేశారా అంటూ ట్విట్టర్ లో పేర్కోన్నారు.

కమల్ నాలుక కత్తిరించాలి...

కమల్ నాలుక కత్తిరించాలి...

కాగా తమిళ నాడు కమలహాసన్ మిశ్రమ స్పందన వస్తుంది. తమిళనాడు బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూంటే అక్కడి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాత్రం కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు 1000 శాతం నిజమేనని అన్నారు. కాగా తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలజీ మాత్రం ఆయన నాలుక కోయాలి అంటూ తీవ్రంగా స్పందించారు. ఒక వ్యక్తి కారణంగా మొత్తం మతాన్ని నిందించలేమని రాజెంద్ర బాలాజీ అన్నారు.

కమల్ పై వేటు వేయాలి...ఈసీకి పిర్యాధు..

కమల్ పై వేటు వేయాలి...ఈసీకి పిర్యాధు..

మరోవైపు ఈ వ్యాఖ్యలు చేసిన కమల హసన్ పై అటు బీజేపీ నాయకులు కత్తులు నూరుతున్నారు. ఆయన గాంధికి వారసుడు కాదని జిన్నాకు వారసుడని మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే జిన్నా పాకిస్థాన్ నుండి హిందువుల శవాలను వేలాదిగా రైళ్లలో వేసి పంపించిన ఘటన గుర్తుకు లేదా అంటూ ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగానే ఆయనపై 5 రోజులపాటు వేటు వేయాలని ఎన్నికల కమీషన్ కు పిర్యాధు చేశారు.

English summary
The comments made by MNM party chief Kamal Hassan ON Nathuram godse Tamilnadu Opposition parties , other Hindutwa parties and other persons are striking against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X