
ఢిల్లీ జహంగీర్ పురి హింసపై కేంద్రం కన్నెర్ర-5గురు నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు
ఢిల్లీలోని జహంగీర్ పురి లో చెలరేగిన మతఘర్షణల కేసులో కేంద్రం కన్నెర్ర చేసింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసింది. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్తానా ప్రకటించారు.
ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శనివారం జరిగిన ఘర్షణల నిందితుల్లో ఐదుగురిపై ఎలాంటి అభియోగాలు లేకుండా ఏడాది వరకు నిర్బంధంలో ఉంచేందుకు వీలు కల్పించే కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు మోపారు. ఎన్ఎస్ఏ కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ప్రధాన నిందితుడు అన్సార్ తో పాటు మరో నలుగుర సలీం, ఇమామ్ షేక్ (సోను), దిల్షాద్, అహిర్ ఉన్నారు.

ఢిల్లీ హింసపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానాకు ఫోన్ చేశారు. రెండు రోజుల క్రితం వాయువ్య ఢిల్లీలో పోలీసులతో సహా చాలా మంది గాయపడిన హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులు సహా 24 మందిని అరెస్టు చేశారు. వారిలో ఐదుగురిపై కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద అభియోగాలు మోపారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు అని అధికారులు సంతృప్తి చెందితే లేదా ప్రజా భద్రతకు విఘాతం కలిగించకుండా నిరోధించడానికి ప్రజలను నెలల తరబడి నిర్బంధించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
గతంలో పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల సందర్భంగా రెండేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ అల్లర్ల గురించి స్పష్టంగా ప్రస్తావించిన హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ,.. హోం మంత్రి తాజా ఘటనలపై చాలా సిరియస్ గా ఉన్నారని, ఈ విషయాన్ని విచారిస్తున్నప్పుడు ఎటువంటి తప్పు చేయవద్దని ఢిల్లీ పోలీసులను కోరినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.