• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఊరంతా ఒక్కటై ఆమెను నగ్నంగా మార్చారు... జుట్టు కత్తిరించారు... సెల్‌ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.

|

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన దేశాన్ని కుదిపేస్తుండగానే అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ యువతిపై జరిగిన ఘోరం వెలుగుచూసింది. హత్రాస్ ఘటన జరిగిన కేవలం 10 రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. గ్రామంలోని ఓ యువకుడితో పారిపోయిందన్న కారణంతో ఆమె జుట్టు కత్తిరించి,నగ్నంగా మార్చి... రాత్రంతా అలాగే ఓ స్కూల్లో పడుకోబెట్టారు.అంతేకాదు,ఆ తతంగమంతా సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

అరుణాచల్ ప్రదేశ్‌లోని చంగ్లంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతికి కొన్నేళ్ల క్రితం ఓ యువకుడితో వివాహమైంది. పెళ్లయిన నాటి నుంచి భర్తతో నరకం అనుభవిస్తోంది. ప్రతీరోజూ ఆమెపై అతను దాడి చేయడం కామన్‌ అయిపోయింది. ఆఖరికి గర్భంతో ఉందని కూడా చూడకుండా ఓ రాత్రి ఆమె పొత్తి కడుపుపై కాలితో తన్నాడు. దీంతో గర్భ స్రావం జరిగింది. ఆ తర్వాత మరోసారి కూడా అలాగే దాడి చేసి గర్భం పోగొట్టాడు. ఈ మొత్తం వ్యవహారంలో అతని తల్లి కూడా కోడలిపై దాడికి సహకరించేది. ఈ క్రమంలో పలుమార్లు ఇరువురి కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నా లాభం లేకపోయింది. పైగా భర్త నుంచి హింస మరింత ఎక్కువైందే తప్ప తగ్గలేదు.

ఆ నరకం నుంచి బయటపడేందుకు..

ఆ నరకం నుంచి బయటపడేందుకు..

ఐదేళ్లుగా ఆమె అనుభవిస్తున్న చిత్రహింసలను దగ్గరగా చూస్తున్న ఓ యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు.ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి బతుకుదామని... తద్వారా ఈ నరకం నుంచి బయటపడవచ్చునని చెప్పాడు. నిజానికి అందుకు ఆమె ఒప్పుకోలేదు. కానీ అతను పట్టువదలకుండా ఆమె వెంటపడటంతో చివరకు అతనితో వెళ్లేందుకు ఒప్పుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇద్దరు అసోంలోని టిన్‌సుకియాకు పారిపోయారు. కొద్దిరోజులకు యువకుడి కుటుంబం నుంచి వారికి ఫోన్ కాల్ వచ్చింది. జరిగిందేదో జరిగింది... ఇక గ్రామానికి వచ్చేయండి... అంతా కలిసి ఉందామని చెప్పారు. నిజానికి ఆ మాటలను నమ్మేందుకు కాస్త సందేహించినప్పటికీ... చివరకు నమ్మకంతో గ్రామంలో అడగుపెట్టారు.

ఊరంతా ఒక్కటై...

ఊరంతా ఒక్కటై...

ఆ ఇద్దరూ గ్రామంలో అడుగుపెట్టిన రాత్రి... అప్పటికే ఊరంతా ఒక్క దగ్గర గుమిగూడింది. వాళ్లు కనిపించడమే ఆలస్యం... గ్రామానికి చెందిన మహిళలు ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చారు. రాత్రి వేళ చన్నీళ్లు తెచ్చి ఆమె ఒంటిపై గుమ్మరించారు. బలవంతంగా జుట్టు కత్తిరించడమే గాక దుస్తులన్నీ చించేసి నగ్నంగా మార్చారు. ఆమె తన చేతులను అడ్డుపెట్టుకోగా... చేతులు పైకెత్తాలని డిమాండ్ చేశారు.అడ్డుకోబోయిన ఆమె ప్రియుడిపై దాడి చేశారు. ఈ తతంగాన్ని ఆ ఊరి యువకులంతా తమ సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

  Hathras ఘటన కోసం ఇంత రాద్ధాంతం ఎందుకు : BJP State Mahila Morcha President Geeta Murthy
  రాజీ కుదిర్చే ప్రయత్నం...

  రాజీ కుదిర్చే ప్రయత్నం...

  భవిష్యత్తులో ఆ యువతి మరో పెళ్లి చేసుకోవద్దని కుల పెద్ద మనుషులంతా కలిసి తీర్మానించారు. ఆమెను ఊరి నుంచి వెలివేయాలని కూడా తీర్మానం చేశారు. ఆమె ప్రియుడు ఆమెతో అన్ని బంధాలను తెంచేసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమెను నగ్నంగానే గ్రామంలోని స్కూల్ వద్దకు తీసుకెళ్లి పడేశారు. రాత్రంతా ఆ చలిలో నగ్నంగా... అవమాన భారంతో ఆమె కుమిలి కుమిలి ఏడ్చింది. ఎలాగోలా తన తాతకు ఈ విషయం చేరవేయడంతో... ఆయన గ్రామ పెద్దలను నిలదీశాడు. దీంతో రూ.40వేలు ఇస్తామని... ఈ విషయాన్ని పోలీసుల వరకూ తీసుకెళ్లవద్దని రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

  English summary
  This incident was barely ten days after the Hathras atrocity. Thousands of kilometers away in Arunachal Pradesh, Ranjana (name changed) was declared guilty by a Kangaroo court.“No it wasn’t a love affair, but Ritul (name changed) was aware of my state. He knew that my husband for five years brutally assaulted me every day. I had a miscarriage when he kicked me in my abdomen one night. After that there was one more miscarriage. I had to be admitted once in the hospital when the brutality was extreme. My mother-in-law sided her son to hit me and this was routine. Several meetings between my family and the in-laws were not fruitful and my fate did not change,” says Ranjana with her head covered with a scarf.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X