• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోటెత్తుతున్న పోర్‌బంద‌ర్‌: మ‌హాత్ముడు పుట్టిన గ‌డ్డ అత‌లాకుత‌లం!

|

అహ్మ‌దాబాద్‌: అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన వాయు తుఫాన్ గుజ‌రాత్‌పై పెను ప్ర‌భావాన్ని చూపుతోంది. తుఫాన్ ధాటికి గుజ‌రాత్ తీరంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. రాకాసి అల‌లు ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్నాయి.

రాజ‌న్న బ‌డిబాట కానుక‌:గ‌్రామాల్లో ప‌్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు..ఉచిత రవాణా?

గురువారం ఉద‌యం వాయు తుఫాన్ గుజ‌రాత్‌లోని పోర్బంద‌ర్‌, మ‌హువా మ‌ధ్య తీరాన్ని తాకే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేశారు. వాయు తుఫాన్ ప్ర‌భావానికి ఒక్క గుజ‌రాత్ మాత్ర‌మే కాదు.. మ‌హారాష్ట్ర సైతం గ‌జ‌గ‌జమంటోంది. తీర ప్రాంత న‌గ‌రం ముంబై చివురుటాకులా వ‌ణికిపోతోంది. జ‌న‌జీవ‌నం పూర్తిగా స్తంభించిపోయింది.

Strong winds, dust hit Somnath temple; Ahmedabad-Porbandar flights cancelled

తీరం అల్ల‌క‌ల్లోలం..

వాయు తుఫాన్ ప్ర‌భావం గుజ‌రాత్ తీర ప్రాంత ప‌ట్టణం పోర్‌బంద‌ర్‌పై తీవ్రంగా ఉంది. పోర్‌బంద‌ర్ స‌మీపంలో స‌ముద్రం సుమారు 30 మీట‌ర్ల వ‌ర‌కు ముందుకు చొచ్చుకుని వ‌చ్చింది. తీర ప్రాంతాల‌ను ముంచెత్తింది. సుమారు ఆరు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. వాయు తుఫాన్ సృష్టించ‌బోతున్న బీభ‌త్సాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ బ‌లగాల‌ను గుజ‌రాత్‌కు త‌ర‌లించింది.

Strong winds, dust hit Somnath temple; Ahmedabad-Porbandar flights cancelled

వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాల‌ను తీర ప్రాంతాల్లో మోహ‌రింప‌జేసింది. తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సుర‌క్షిత ప్ర‌దేశాల‌కు త‌ర‌లిస్తున్నారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సుమారు రెండు ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. తీర ప్రాంతాల్లో నివ‌సిస్తున్న మ‌త్స్యకారులు త‌మ ఇళ్ల‌ను కూడా ఖాళీ చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వాహ‌నాల్లో త‌ర‌లి వెళ్తున్నారు.

తీరాని తాకిన క్ష‌ణాన‌..

వాయు తుఫాన్ పోర్‌బంద‌ర్-మ‌హువా మ‌ధ్య గురువారం ఉద‌యం తీరాన్ని తాకే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు. తుఫాన్ తీరాన్ని దాటే స‌మ‌యంలో బ‌లమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని, వాటి వేగం గంట‌కు 155 నుంచి 170 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని తెలిపారు. తుఫాన్ తాకిడి తీవ్రంగా ఉండే ప్రాంతాల మీదుగా రైళ్ల రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేశారు. విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రైళ్లను రద్దు చేస్తున్న‌ట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు.

Strong winds, dust hit Somnath temple; Ahmedabad-Porbandar flights cancelled

విరావ‌ల్ ఓఖా, పోర్‌బందర్, భావ్‌నగర్, భుజ్, గాంధీధామ్ స్టేషన్ల మీదుగా రాక‌పోక‌లు సాగించే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైలు స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశామ‌ని అన్నారు. ఆయా స్టేష‌న్ల‌లో చిక్కుకుపోయిన ప్ర‌యాణికుల‌ను వారి గ‌మ్య‌స్థానాల‌కు త‌ర‌లించ‌డానికి ఓ ప్ర‌త్యేక రైలును న‌డిపిస్తామ‌ని చెప్పారు. దీనితోపాటు- అహ్మదాబాద్ నుంచి డయ్యూ, పోర్‌బందర్, కాండ్లా, భావ్‌నగర్‌లకు విమానాల రాకపోకలను రద్దు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As Gujarat braces for Very Severe Cyclonic Storm ‘Vayu’, which is expected to make landfall on Thursday, Mumbai and some neighbouring coastal areas of Maharashtra witnessed a windy Wednesday morning. According to the India Meteorological Department (IMD), Cyclone Vayu is very likely to move nearly northwards and cross Gujarat coast between Porbandar and Mahuva around Veraval and Diu region as a Very Severe Cyclonic Storm with wind speed 145-155 kmph gusting to 170 kmph around Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more