వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. ఫేస్‌‌బుక్ పోస్టుతో విద్యార్థి అరెస్ట్..!

|
Google Oneindia TeluguNews

లక్నో : సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న తరుణంలో అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెచ్చుమీరిపోతున్నాయి. ఇక వీఐపీలు, సెలబ్రిటీల మీద రెచ్చిపోతున్న యువత సంఖ్య పెరిగిపోతోంది. ఆ క్రమంలో కేసులు ఫైల్ అవుతున్న సందర్భాలు కూడా అనేకం. అదే కోవలో తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఓ విద్యార్థి అభ్యంతరకర పోస్టు పెట్టడంతో చివరకు కటాకటాలపాలయ్యాడు.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU) కు చెందినట్లుగా పేర్కొన్న 20 సంవత్సరాల మహ్మద్ జైద్ రషీద్ అనే యువకుడు ప్రధాని నరేంద్ర మోడీని అవమానించే విధంగా ఫేస్‌బుక్ పేజీలో అభ్యంతరకర పోస్టు పెట్టినట్లు నిర్ధారించారు పోలీసులు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు.. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నిరసనలకు సంబంధించి ఓ పోస్టర్‌ను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.

student arrested over Modi poster on Facebook as indecent way

బెజవాడలో లక్ష ఇళ్లు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

సదరు విద్యార్థి పెట్టిన పోస్టు కాస్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు ఆరా తీయడంతో రషీద్ చేసిన నిర్వాకం బయటపడింది. అయితే అతను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థిగా చెప్పుకుంటూ సదరు పోస్ట్ పబ్లిష్ చేశారు. అయితే అతను ఆ వర్సిటీ విద్యార్థి కాదనే విషయం కూడా బయటపడింది.

రషీద్ బీహార్‌లోని వర్సిటీ స్టడీ సెంటర్‌లో ఇటీవల అడ్మిషన్ తీసుకున్నట్లు గుర్తించారు. దాంతో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి రషీద్‌తో గానీ, ఈ వివాదంతో గానీ ఎలాంటి సంబంధం లేదని అక్కడి ప్రతినిధి షైఫీ కిద్వాయ్ స్పష్టం చేశారు. మొత్తానికి ప్రధాని మీద అభ్యంతరకర పోస్టు పెట్టిన రషీద్ మీద ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఆకాష్ తెలిపారు. తదుపరి దర్యాప్తు తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

English summary
20-year-old Mohammed Zaid Rashid, a young man who claims to belong to the Aligarh Muslim University (AMU), has posted a defamatory post on his Facebook page to insult Prime Minister Narendra Modi. Arrested to that extent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X