వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Snake Bite: పామును పట్టుకున్నాడు.. కానీ ఆ పామే కాటేసింది..

|
Google Oneindia TeluguNews

పాములు పట్టే వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలపైకి వస్తుంది. తాజాగా ఓ వ్యక్తి పామును పట్టుకోవడానికి వెళ్లి, అది కాటు వేయడంతో మరణించాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో జరిగింది. కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామానికి చెందిన కొండూరి నాగబాబుశర్మ(48) పౌరోహిత్యం చేస్తాడు.

హైదరాబాద్

హైదరాబాద్

నాగబాబు శర్మ గత కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. దసరా సందర్భంగా ఆయన కృత్తివెన్నుకు వెళ్లారు. అయితే అతను పాములు పడతాడు. శనివారం మధ్యాహ్నం కృత్తివెన్నులోని ఓ ఇంటిలోకి పాము వచ్చింది. దీంతో నాగబాబు శర్మ పామును పట్టుకోవడానికి వెళ్లాడు. పామును పట్టుకున్నాడు.

అడవికి తీసుకెళ్లే

అడవికి తీసుకెళ్లే

అయితే పామును అడవికి తీసుకెళ్లే క్రమంలో అతనిని పాము కాటు వేసింది. అయితే నాగబాబు శర్మ తనకు తెలిసిన నాటు వైద్యం చేసుకున్నాడు. కాసేపటి తర్వాత అతని పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతన్నిచినపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగబాబు శర్మనుమచిలీపట్నం తీసుకువెళ్లాలని సూచించారు.

మచిలీపట్నం

మచిలీపట్నం

కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా మరణించాడు. అయితే ఆయన మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఎంతోమందికి పాముకాటు బారినుంచి రక్షించిన ఆయన అదే పాము కాటుతో చనిపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
While catching the snake and releasing it in the forest, a person was bitten by a snake. As a result, he died. This incident happened in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X