వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: విద్యార్థి నాయకుడిని కాల్చిచంపి హాస్టల్ ముందే పడేసిన దుండగులు

|
Google Oneindia TeluguNews

వారణాసి: ఉత్తర్ ప్రదేశ్‌లో మళ్లీ తుపాకుల శబ్దం వినిపించింది. అయితే ఈసారి ఏ అధికారపక్షం నాయకుడో లేక ప్రతిపక్షం పార్టీకి చెందిన వ్యక్తో మృతి చెందలేదు. కొందరు దుండగులు పేల్చిన తూటాలకు ఓ విద్యార్థి నాయకుడు బలయ్యాడు. ఈ విషాద ఘటన వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్‌లో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళితే... వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల విద్యార్థి వివేక్ సింగ్‌ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. వివేక్ సింగ్ బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. అజామ్‌ఘఢ్ జిల్లా జమూన్డీ గ్రామం ఆయన సొంత ఊరు. కాలేజీ క్యాంపస్‌లోనే ఈ హత్య జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వివేక్‌సింగ్‌ శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగడంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయి మృతి చెందాడు.

Student Leader Shot at 8 Times, Killed in Front of Hostel in Varanasi

రక్తపుమడుగులో పడిపోయిన వివేక్‌సింగ్‌ను అటుగా వెళుతున్న మరో విద్యార్థి గమనించి విషయాన్ని ఇతర విద్యార్థులకు ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడని ఎస్ఎస్పీ ఆనంద్ కుల్‌కర్ణి తెలిపారు. వివేక్ సింగ్‌పై ఎనిమిది సార్లు దుండగులు .32 ఎంఎం పిస్టోల్‌తో కాల్పులు జరిపినట్లు కుల్‌కర్ణి తెలిపారు. వివేక్‌సింగ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

నిందితులను పట్టుకునేందుకు ఏడు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థి నాయకుడు వివేక్ సింగ్ హత్యకు గురికావడంతో క్యాంపస్‌లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. విద్యార్థులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారిని సముదాయించేందుకు జిల్లా కలెక్టర్ సురేంద్ర సింగ్ క్యాంపస్‌కు వెళ్లారు. ప్రస్తుతం క్యాంపస్ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది.

English summary
A 22-year-old student leader of Uday Pratap College here was shot dead by unidentified assailants in front of his hostel in the campus on Sunday night, police said.Vivek Singh, a B.Com second year student and native of Jamundeeh village in Azamgarh district, was found lying in a pool of blood by a passer-by who informed other students as well as the police, said SSP Anand Kulkarni.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X