వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పకోడిలు అమ్మినందుకు పనిష్మెంట్ ఇచ్చారు..

|
Google Oneindia TeluguNews

చండీగఢ్ : పకోడీలు అమ్మి రోజుకు రూ.200 సంపాదిస్తే దాన్ని ఓ ఉద్యోగం కిందే చూడాలన్న మోడీ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. మోడీ కామెంట్లకు అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా చండీగఢ్‌లో ప్రధాని మోడీకి పకోడీల సెగ తగిలింది. ఆయన వ్యాఖ్యలపై కొందరు విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. గ్రాడ్యుయేషన్ సెర్మెనీ రోజున వేసుకునే నల్ల కోట్లు ధరించి మోడీ సభలో పకోడీలు అమ్మే ప్రయత్నం చేశారు. ఇంజనీర్లు చేసిన పకోడీలు, లాయర్లు చేసిన పకోడీలని అరుస్తూ సభకు వచ్చిన వారి దృష్టి ఆకర్షించారు.

పక్షవాతంతో బాధపడుతున్న చిన్నారికి భరోసా.. అన్నం తినిపించిన పక్షవాతంతో బాధపడుతున్న చిన్నారికి భరోసా.. అన్నం తినిపించిన "సైనికుడు" (వీడియో)

మోడీ సభలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పకోడీలు అమ్ముతూ నిరసనకు దిగడంపై పోలీసులు స్పందించారు. పకోడీలు విక్రయిస్తున్న 12 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మోడీ సభ పూర్తయ్యే వరకు స్టేషన్‌ నుంచి అడుగు బయటపెట్టకుండా పనిష్మెంట్ ఇచ్చారు. పకోడీలు అమ్మినా ఉద్యోగం కిందే పరిగణించాలంటూ మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే పకోడీలు అమ్మినట్లు విద్యార్థులు చెప్పారు. పకోడీ ఉపాధి పథకం ద్వారా మాకు ఉద్యోగాలిచ్చిన మోడీకి పకోడీలతో కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చామని నిరసనకారుల్లో ఒక యువతి సటైర్ వేశారు.

Students detained for selling Modi pakodas near PMs rally venue

బీజేపీ అభ్యర్థి కిరణ్ ఖేర్‌కు మద్దతుగా చండీగఢ్‌లో నిర్వహించిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఈ సభలోనే 12 మంది ఇంజనీరింగ్, ఎల్ఎల్‌బీ చదువుతున్న విద్యార్థులు పకోడీలు అమ్మి నిరసన వ్యక్తం చేశారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు మోడీ సభ పూర్తైన తర్వాత విడిచిపెట్టారు.

English summary
Police on Tuesday detained around 12 college students for selling "Modi pakodas" wearing their degree robes near the venue of the prime minister's rally here. The students wearing the robes were selling pakodas named after Prime Minister Narendra Modi and their degrees Engineer, BA, and LLB, near the venue he was to address a rally in support of BJP candidate Kirron Kher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X