• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Students: రెస్టారెంట్ లో అమ్మాయిలతో చర్చి ఫాదర్ ?, సినిమా స్టైల్లో చేజింగ్, కారు అద్దాలు ద్వంసం !

|
Google Oneindia TeluguNews

చెన్నై/కన్యాకుమారి: కాలేజ్ లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రత్యేక క్లాసులు జరుగుతున్నాయి. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు కాలేజ్ సమీపంలోని రెస్టారెంట్ కు వెళ్లి కొంత సమయం ఎంజాయ్ చేసి తరువాత ఇంటికి వెలుతున్నారు. ఎప్పటిలాగే అమ్మాయిలు, అబ్బాయిలు రెస్టారెంట్ కు వెళ్లిన టిఫిన్లు చేస్తున్న సమయంలో పక్కనే కుర్చున్న చర్చి ఫాదర్ మద్యం మత్తులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆయన కారు అద్దాలు ద్వంసం చెయ్యడం కలకలం రేపింది.

 కాలేజ్ విద్యార్థులు

కాలేజ్ విద్యార్థులు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ లో సీఎస్ఐ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో ఒక కాలేజ్ నిర్వహిస్తున్నారు. నాగర్ కోవిల్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న విద్యార్థులు ఈ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. కాలేజ్ లో చదువుతున్న ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

 అమ్మాయిల పక్క టేబుల్ లో చర్చి ఫాదర్

అమ్మాయిల పక్క టేబుల్ లో చర్చి ఫాదర్

కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు కాలేజ్ సమీపంలోని రెస్టారెంట్ కు వెళ్లి కొంత సమయం ఎంజాయ్ చేసి తరువాత ఇంటికి వెలుతున్నారు. ఎప్పటిలాగే అమ్మాయిలు, అబ్బాయిలు రెస్టారెంట్ కు వెళ్లిన టిఫిన్లు చేస్తున్నారు. ఆ సందర్బంలో పక్క టేబుల్ లో చర్చి ఫాదర్ శ్యాముయల్ కుర్చున్నారు.

 అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడని ?

అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడని ?

కాలేజ్ అమ్మాయిలతో మాట్లాడిన చర్చి ఫాదర్ శ్యాముయల్ వారితో అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న చర్చి ఫాదర్ శ్యాముయల్ అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడని, ఇద్దరు అమ్మాయిలను లాడ్జ్ కు రావాలని పిలిచాడని సాటి విద్యార్థులు ఆరోపించారు.

 చర్చి ఫాదర్ కారు అద్దాలు ద్వంసం

చర్చి ఫాదర్ కారు అద్దాలు ద్వంసం

ఆ సందర్బంలో విద్యార్థులు ఎదురు తిరగడంతో చర్చి ఫాదర్ శ్యాముయల్ ఆయన కారులో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కొందరు కాలేజ్ అబ్బాయిలు బైక్ లో వెంబడించి మార్గం మద్యలో చర్చి ఫాదర్ శ్యాముయల్ కారు అడ్డగించారు. తరువాత చర్చి ఫాదర్ శ్యాముయల్ కారు అద్దాలు ద్వంసం చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 పోలీసులు పట్టించుకోలేదని ?

పోలీసులు పట్టించుకోలేదని ?

విషయం తెలుసుకున్న నాగర్ కోవిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలేజ్ విద్యార్థులను నచ్చచెప్పి చర్చి ఫాదర్ శ్యాముయల్ ను పోలీసు భద్రతతో అక్కడి నుంచి పంపించారు. ఇంత జరిగినా పోలీసులు చర్చి ఫాదర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలేజ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారని తమిళ మీడియా అంటోంది.

English summary
Students: Pastor escaped drunk and drive student chased away in cinema style near Kanyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X