వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటే కఠిన చర్యలు: ఐఐటీ బాంబే హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

ముంబై: జాతివ్యతిరేక కార్యక్రమాల్లో లేదా సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో తమ విద్యార్థులు పాల్గొనరాదని ఐఐటీ బాంబే ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే జాతి వ్యతిరేక కార్యక్రమాలు, సామాజిక వ్యతిరేక కార్యక్రమాలు అంటే ఏమిటనేదానిపై ఐఐటీ బాంబే పాలనా వర్గం స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థులందరికీ 15 పాయింట్లతో కూడిన సూచనలను ఈ-మెయిల్ ద్వారా పంపించింది. జనవరి 28వ తేదీన విద్యార్థులకు ఈ-మెయిల్ పంపడం జరిగింది.

విద్యార్థులకు ఈ-మెయిల్ చేసిన ఐఐటీ బాంబే

విద్యార్థులకు ఈ-మెయిల్ చేసిన ఐఐటీ బాంబే

ఐఐటీ బాంబే హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు ఎలాంటి జాతి వ్యతిరేకత కార్యక్రమాల్లో లేదా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనరాదని 10వ పాయింట్‌లో పేర్కొంది. గత నెలరోజులుగా జామియా మిలియా ఇస్లామియా మరియు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరిగిన హింసాత్మక ఘటనను ఖండిస్తూ అక్కడి విద్యార్థులకు సంఘీభావం తెలిపుతూ క్యాండిల్ మార్చ్ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థులు ఎవరైనా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మెయిల్ ద్వారా పాలనా విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవు

విద్యార్థులు హాస్టల్‌లో కానీ, క్యాంపస్‌లో కానీ ఎలాంటి పామ్‌ప్లేట్లు కానీ, పోస్టర్లు కానీ ప్రదర్శించరాదని పేర్కొంది. హాస్టల్ వార్డన్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించింది. ఇక క్యాంపస్‌లో ప్రసంగాలు ఇవ్వడం, మ్యూజిక్ ప్లే చేయడం, లేదా శాతియుత వాతావరణానికి విఘాతం కలిగించడాన్ని సీరియస్‌గా తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఫాకల్టీ కూడా ఇలాంటి పనులకు పాల్పడరాదని స్పష్టం చేసింది. డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫెయిర్స్ అనుమతితోనే అన్ని జరగాలని కఠినంగా ఆదేశాల్లో పేర్కొంది.

రాజకీయపరమైన అంశాలను క్యాంపస్ బయటే చర్చించాలి

రాజకీయపరమైన అంశాలను క్యాంపస్ బయటే చర్చించాలి


క్యాంపస్‌లో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని అంతకుముందు బహిరంగ సమావేశంలో ఐఐటీ బాంబే డైరెక్టర్ విద్యార్థులకు సూచించారు. రాజకీయపరమైన అంశాలను కేవలం క్యాంపస్ బయటే చర్చించుకోవాలని క్యాంపస్‌లో కాదని డైరెక్టర్ విద్యార్థులకు చెప్పారు. ఇక రాజకీయపరమైన అభిప్రాయాల గురించి చర్చించేటప్పుడు ఇన్స్‌టిట్యూట్ పేరు తీయరాదని హెచ్చరించారు. ఐఐటీ బాంబే నిర్వహణకు నిధులు ప్రభుత్వం నుంచి వస్తుందని ఇది ప్రజాధనంతో నిర్వహించబడుతోందని గుర్తుచేసిన డైరెక్టర్ రాజకీయాలకు క్యాంపస్‌ను వినియోగించుకోరాదని చెప్పారు.

English summary
The IIT Bombay administration has warned students residing in its hostels from participating in any "anti-national" or "anti-social" activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X