• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డీఆర్‌డీవో 2డీజీ : అన్ని కోవిడ్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్న డ్రగ్.. పరిశోధనలో వెల్లడి

|

డీఆర్‌డీవో తయారుచేసిన యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డీజీ అన్ని రకాల కోవిడ్ 19 వేరియంట్స్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కణాల్లో వైరస్ విస్తృతిని తగ్గించడమే కాకుండా దాని తీవ్రతను తగ్గించడం ద్వారా కణాలు మృతి చెందకుండా చేయగలదని వెల్లడైంది. వైద్య నిపుణులు అనంత నారాయణ భట్, అభిషేక్ కుమార్, యోగేష్ రాయ్, దివియ యాదగిరిలతో కూడిన బృందం పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జూన్ 15న వెలువడిన ఈ పరిశోధనపై మరింత సూక్ష్మ స్థాయిలో అధ్యయనం జరగాల్సి ఉంది. ప్రస్తుతం వెలువడిన ఫలితాలు ప్రాథమిక పరిశోధనకు సంబంధించినవేనని చెబుతున్నారు.

2డీజీ డ్రగ్‌తో త్వరగా కోలుకుంటారు...

2డీజీ డ్రగ్‌తో త్వరగా కోలుకుంటారు...

క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన వివరాల ప్రకారం... కోవిడ్‌తో ఆస్పత్రిపాలైన పేషెంట్లకు 2డీజీ డ్రగ్ ఇవ్వడం ద్వారా వారు త్వరగా కోలుకుంటారు. సాధారణంగా కోవిడ్ పేషెంట్ వ్యాధి నుంచి కోలుకోవడానికి పట్టే సమయం కంటే... ఈ డ్రగ్ తీసుకోవడం ద్వారా రెండున్నర రోజుల ముందే కోలుకుంటారు. అలాగే పేషెంట్‌కు బయటినుంచి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం 40 శాతం తగ్గుతుంది.ఈ డ్రగ్ వైరస్‌ వ్యాపించిన కణాలకు గ్లూకోజ్‌ అందకుండా చేయడం ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రోగుల్లో తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు.

మంచినీళ్లలో కలుపుకుని తాగడమే...

మంచినీళ్లలో కలుపుకుని తాగడమే...

డీర్‌డీవో 2డీజీ డ్రగ్‌ను కోవిడ్ అత్యవసర చికిత్సలో వినియోగించేందుకు కేంద్రం మే 19న అనుమతినిచ్చింది. డీఆర్‌డీవో,డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంయుక్తంగా దీన్ని అభివృద్ది చేశాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ డ్రగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. సాచెట్ రూపంలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఒక్కో సాచెట్ ధర రూ.990గా నిర్ణయించారు. దీన్ని మంచినీళ్లలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే దీన్ని వినియోగించాలని డీసీజీఐ(Drugs Controller General of India) సూచించింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత గరిష్టంగా 10 రోజులపాటు 2డీజీ డ్రగ్ ఇవ్వొచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని సూచించింది.

వారికి ఈ డ్రగ్ ఇవ్వొద్దు...

వారికి ఈ డ్రగ్ ఇవ్వొద్దు...

2-డీజీ ఔషధం ఒక రకంగా గ్లూకోజ్ వంటిది. ఇలాంటి జనరిక్ మాలిక్యూల్‌ను తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సులభంగా ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా వేగంగా వ్యాధిని నయం చేసే అవకాశం ఉంటుంది. పొడి రూపంలో ఉండే ఈ మందు సాచెట్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీన్ని నీటిలో కలుపుకుని తాగిన వెంటనే మందు పనిచేయడం మొదలవుతుంది. 2డీజీ డ్రగ్ వాడిన రోగులు త్వరగా కోలుకున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వొద్దని కేంద్రం గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  Farmer: రైతన్న దీన పరిస్థితి Son As Bullock For Cultivation ఒక వైపు ఎద్దు.. మరోవైపు కొడుకు..
  English summary
  Recent research has shown that the anti-covid drug 2-DG manufactured by DRDVO works effectively on all types of Kovid 19 variants. It has been shown that it can reduce the spread of the virus in cells as well as reduce its severity, preventing cells from dying.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X