వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 రోజుల్లో ఆధార్ డీ లింక్ ప్లాన్ ఇవ్వండి: టెలికాం సంస్థలకు ఉడాయ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్‌ను డీ లింక్ చేసే ప్లాన్‌ను పదిహేను రోజుల్లోగా ఇవ్వాలని భారత ఉడాయ్‌... టెలికాం సంస్థలను కోరింది. ఆధార్‌ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపేయాలని తెలిపింది. మొబైల్‌ నంబర్లతో ఆధార్‌ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్‌ అడ్మిషన్లకు కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు నాలుగు రోజుల క్రితం తీర్పు చెప్పింది.

టెలికాం సంస్థలు సహా ప్రయివేటు కంపెనీలు ఆధార్‌ నంబర్ అడగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఉడాయ్‌ భారతి ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌ ఐడియా తదితర టెలికాం సేవల కంపెనీలకు సర్య్కులర్‌‌ను పంపింది. టెలికాం సంస్థలు ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థలను నిలిపివేసే, ఆధార్‌ను‌ డీ లింక్‌ చేసే ప్రణాళికలను అక్టోబరు 15లోగా ప్రణాళిక అందించాలని అడిగింది.

Submit Aadhaar De Linking Plan Within 15 Days, Telecom Firms Told

వ్యక్తుల ఫొటో, వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్స్‌ ఉన్న ఆధార్‌ సమాచారాన్ని ప్రయివేటు కంపెనీలు డిమాండ్‌ చేయడానికి వీల్లేదని భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే ఆధార్‌ రాజ్యాంగ బద్ధమేనని కోర్టు స్పష్టంచేసింది.

English summary
Telecom companies have been given 15 days by the Unique Identification Authority of India to give a plan to stop using Aadhaar number for customer authentication. This comes days after the Supreme Court, in a landmark verdict, struck down attempts to make it mandatory for mobile phone connections and several other services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X