వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, రాహుల్‌కు.. స్వామి ఝలక్! నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అనూహ్య మలుపు!!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణ శనివారం అనూహ్య మలుపు తిరిగింది. కేసు విచారణను ప్రారంభించిన పటియాలా కోర్టుకు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఆదేశాలను సమర్పించారు.

ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద తలకాయలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శనివారం పటియాలా కోర్టు ఈ కేసులో విచారణను ప్రారంభించింది.

Subramanian Swamy drops I-T bomb on Rahul, Sonia Gandhi in National Herald case

2012లో వడ్డీ లేకుండా రూ. 90.25 కోట్ల రుణాన్ని నేషనల్‌ హెరాల్డ్‌ న్యూస్‌పేపర్‌ను నడుపుతున్న అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందంటూ సుబ్రమణియన్‌ స్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో సోనియా, రాహుల్‌, మోతీలాల్‌ వోరాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

2016లో స్వామి పిటిషన్‌పై స్పందించాలంటూ కోర్టు సోనియా, రాహుల్‌లను న్యాయస్థానం కోరింది. దీంతో గతేడాది నవంబర్‌లో రాహుల్‌, ఆయన తల్లి సోనియాలు కోర్టులో స్వామి పిటిషన్‌పై కౌంటర్‌ను దాఖలు చేశారు.

శనివారం పటియాలా కోర్టు ఈ కేసులో విచారణను ప్రారంభించగా.. తన పిటిషన్‌ను బలపర్చుతూ స్వామి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఆదేశాల పత్రాలను ఆధారాలుగా సమర్పించారు. దీంతో కాంగ్రెస్ వర్గాలు షాక్ తిన్నాయి.

English summary
JP MP Subramanian Swamy today brought another twist in the National Herald case against Congress president Rahul Gandhi and his mother Sonia Gandhi. Subramanian Swamy produced an Income Tax assessment order against the now-defunct Young Indian company.Rahul Gandhi and Sonia Gandhi were the main stakeholders in the Young Indian Private Limited. Swamy has submitted a 105-page long I-T order against Rahul Gandhi and Sonia Gandhi calling the National Herald deal a total sham. The case was today adjourned till March 17. The I-T documents submitted by Swamy will remain sealed till the next hearing.The order, as Swamy claims, reads that Congress party's claim of giving Rs 90 crore loan to AJL (Associated Journals Ltd) is bogus as it never took place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X