వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ సభ్యులుగా మేరీ కోమ్, సుబ్రమణ్య స్వామి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌లు మంగళవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మాజీ ఎంపీ, క్రికెట్ కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న దాస్ గుప్తా, మళయాళం నటుడు సురేష్ గోపీ, ఎకనమిస్ట్ నరేంద్ర జాధవ్‌లను రాజ్యసభ సభ్యత్వానికి పీఎంఓ నామినేట్ చేసింది.

కాగా సోమవారం కూడా మొత్తం తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తొమ్మిది మందిలో ఐదుగురు కాంగ్రెస్‌, ఇద్దరు సీపీఎం, శిరోమణి అకాళీదళ్‌, బీజేపీల నుంచి చెరొకరు చొప్పున రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు.

Subramanian Swamy, Mary Kom take oath as members of Rajya Sabha

కాంగ్రెస్ పార్టీ తరుపున హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ఆనంద్‌ శర్మ, అస్సాం నుంచి రాణీ నారా, రిపున్‌ బోరాలు, పంజాబ్‌ నుంచి ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, షంషేర్‌ సింగ్‌లు రాజ్యసభలో సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

సీపీఐఎం తరపు నుంచి త్రిపుర నుంచి జర్న దాస్‌ బైద్యా, కేరళ నుంచి సోమ ప్రసాద్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా బీజేపీ తరఫున పంజాబ్‌ నుంచి శ్వేత్‌ మాలిక్‌, శిరోమణి అకాలీదళ్‌ నుంచి నరేశ్‌ గుజ్రాల్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.

English summary
Former union minister Subramanian Swamy and Olympic medallist Mary Kom were administered their oath of membership of the Rajya Sabha on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X