వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఎల్‌పీజీ, కిరోసిన్‌లపై సబ్సిడీ కొనసాగుతోంది: ధర్మేంద్ర

పేదలు ఉపయోగించే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేది లేదని రాయితీ కొనసాగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తెలిపారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అగర్తల: పేదలు ఉపయోగించే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేది లేదని రాయితీ కొనసాగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తెలిపారు.

గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేది లేదన్నారు. సామాన్య ప్రజలు వినియోగించే గ్యాస్, కిరోసిన్, సబ్సిడీ ఎత్తివేసేదన్నారు.

Subsidy On LPG Cylinders For Poor To Continue: Union Oil Minister

త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం కింద 20 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో గ్యాస్ కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ నుండి త్రిపుర వరకు పైపులైన్లను వేస్తామన్నారు.

పశ్చిమబంగలోని సిలిగురి నుండి బంగ్లాదేశ్ పర్వతీపూర్‌కు డీజీల్ సరఫరాకు పైప్‌లైన్ వేయనున్నట్టు చెప్పారు.

సబ్సిడీపై అందించే వంటగ్యాస్ సిలిండర్లపై రాయితీని తొలగిస్తామని కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. నెలకు రూ. 4 చొప్పున సిలిండర్‌పై ధరను పెంచుతూ క్రమంగా సబ్సిడీని తొలగిస్తామని కేంద్రం ప్రకటించింది.

దీంతో ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేస్తారనే దానిపై ఆందోళనలు చెలరేగాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చేసిన ప్రకటన కొంత ఊరటనిచ్చింది.

English summary
The subsidy on LPG cylinder for domestic use for the poor will continue, Union Oil Minister Dharmendra Pradhan said today. "We have no plan to withdraw subsidy on LPG for domestic use. Subsidy on LPG and kerosene will continue for the poor and common people," Pradhan told reporters here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X