వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగిరేందుకు సిద్ధమైన సూపర్ సోనిక్ క్షిపణి 'నిర్భయ్'

By Dr Anantha Krishnan M
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సబ్‌‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'నిర్బయ్'ను అక్టోబర్ 17(శుక్రవారం) ఒరిస్సా రాష్ట్రంలోని బాలాసోర్ తాత్కాలిక టెస్టు రేంజ్ నుంచి పరీక్షించనున్నారు.

నిర్బయ్ పేరుతో రూపొందించిన రెండవ క్షిపణి ఇది. మొదటి నిర్బయ్ మిసైల్ మార్చి 12, 2013న ప్రయోగించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణంగా రద్దు చేశారు. బెంగుళూరులో రూపొందిచిన ఈ క్రూయిజ్ క్షిపణి 800 నుంచి 1000 కిమీ రేంజిలో వరకు వెళ్తుంది.

ఈ క్రూయిజ్ క్షిపణిని బెంగుళూరులోని సివి రామన్ నగర్‌లో ఉన్న ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్‌లోని ప్రాధమిక లాబొరేటరీలో రూపొందించారు. ఈ క్షిపణిని ప్రయోగించే సమయంలో విమాన అధికార బోర్డు (ఎఫ్ఎబి) మారథాన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అధికారిక సమాచారం.

చివరి నిమిషంలో ఎటువంటి మార్పులు జరగక్కుండా ఉంటే రేపు ఉదయం 10 గంటలకు ఈ మిసైల్‌ని ప్రయోగించనున్నామని క్షిపణి సైంటిస్ట్ వన్ఇండియాతో చెప్పారు. సాధారణంగా భారతదేశంలో క్షిపణిలను హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉన్న మిసైల్ కాంప్లెక్స్‌లో రూపొందింస్తారు.

కానీ దానికి విరుద్దంగా ఈ నిర్బయ్ క్షిపణిని బెంగుళూరులో రూపొందించారు. ఈ క్షిపణిని ప్రయోగించే సమయంలో చలన మార్గదర్శిని వ్యవస్థ (ఐఎన్ఎస్)ను ఉపయోగించనున్నట్లు సీనియర్ సైంటిస్ట్ చెప్పారు.

నిర్బయ్ క్షిపణి 300 కిమీ దూరం ప్రయాణించి ఆ తర్వాత నెమ్మదిగా తిరిగి 100-150 కిమీ రేంజిలోకి వస్తుందని చెప్పారు. డాక్టర్ కె. తమిళ్‌మణి డైరక్టర్ జనరల్ (ఏరోనాటికల్ సిస్టమ్స్), డీఆర్‌డీఓ మాట్లాడుతూ నిర్బయ్ విజయం తర్వాత మా శాస్త్రవేత్తలు ఈ క్షిపణి యొక్క అధిక వర్సన్‌లో పాలుపంచుకోనున్నారని అన్నారు.

ప్రస్తుతం ఓ అద్బుతమైన క్షిపణిని ప్రయోగించేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. రాబోయే కాలంలో నిర్బయ్ క్షిపణి తక్కువ బరువును కలిగి ఉండటంతో ఒక గొప్ప ఆయుధం అవుతందని అన్నారు.

Subsonic cruise missile Nirbhay ready to strike

నిర్బయ్ క్షిపణి విశేషాలు:

పేరు: నిర్బయ్
అర్దం: భయంలేని
రకం: రెండు వేదికల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి
రేంజి: 800-1000 కిమీ
పొడవు: 6 మీటర్లు
వ్యాసం: 0.52మీ
స్పాన్: 2.7 మీ
బరువు: 1,500 కిలోలు
స్పీడ్: 0.7 మాక్
శక్తి సామర్ద్యాలు: బహుళ యుక్తులు, ఇంటెంట్ లక్షణాలు
ఖర్చు: సుమారుగా రూ. 10 కోట్లు
రూపొందించిన వారు: ADE బెంగుళూరు

ఈ వ్యాసాన్ని రూప కర్త సీనియర్ ఏరోస్పేస్ విభాగంలో పని చేసిన అనుభవంతో పాటు డిఫెన్స్ జర్నలిస్ట్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు. భారతదేశపు అతిపెద్ద మిలిటరీ బ్లాగ్ Tarmak007 పేరుతో వ్యాసాలు రాస్తుంటారు. వన్ఇండియాకు సలహా ఎడిటర్‌గా ఉన్నారు.

English summary
Nirbhay, India's first home-grown subsonic cruise missile, is all set for its launch from Interim Test Range (ITR) in Chandipur (Near Balasore in Orissa) on Friday, Oct 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X