వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: అక్కడ మళ్లీ లాక్ డౌన్.. 235కొత్త కేసులతో పాట్నా బెంబేలు..

|
Google Oneindia TeluguNews

మిగతా పెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య , రికవరీ రేటు మెరుగ్గానే ఉన్నప్పటికీ బీహార్ ప్రభుత్వం చాన్స్ తీసుకోదల్చుకోలేదు. రాజధాని పాట్నా సిటీలో బుధవారం ఒక్కరోజే 235 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. పాట్నాలో మళ్లీ పూర్తి స్థాయి లాక్ డౌన్ కు ఆదేశాలు జారీ చేసింది.

గాల్వాన్ లోయలో చైనా కిరాతక చర్య.. నాటి ఘర్షణపై అమెరికా ఆగ్రహం.. డ్రాగన్‌కు వార్నింగ్..గాల్వాన్ లోయలో చైనా కిరాతక చర్య.. నాటి ఘర్షణపై అమెరికా ఆగ్రహం.. డ్రాగన్‌కు వార్నింగ్..

ఈనెల 10(శుక్రవారం) నుంచి 16 వరకు రాజధానిలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ప్రజలెవరూ బయట తిరగొద్దని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలుకు అనుమతిస్తామని పాట్నా జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

Suddala Ashok Teja, Tollywood, Liver Transplantation

బీహార్ లో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 749 పాజిటవ్ కేసులు వచ్చాయి. అందులో 235 ఒక్క పాట్నా సిటీలోనే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఒకేసారి కేసులు భారీగా పెరగడం ఇదే తొలిసారని, జాగ్రత్త చర్యల్లో భాగంగానే లాక్ డౌన్ విధింపునకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. బుధవారం నాటి కేసులతో కలిపి బీహార్ లో మొత్తం 13,274 కేసులు నమోదుకాగా, అందులో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,541మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,633గా ఉంది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత ఉండటం కూడా లాక్ డౌన్ విధింపునకు మరో కారణమని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ మిస్సింగ్: తెరపైకి సెక్షన్ 8.. అందుకే గవర్నర్ యాక్టివ్.. సంచలనం.. సర్కారు మాటిది..సీఎం కేసీఆర్ మిస్సింగ్: తెరపైకి సెక్షన్ 8.. అందుకే గవర్నర్ యాక్టివ్.. సంచలనం.. సర్కారు మాటిది..

ఇక దేశవ్యాప్త కేసుల విషయానికొస్తే.. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన లెక్కల ప్రకారం.. కొత్తగా 22, 752 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.68లక్షలకు పెరిగింది. అందులో 21,144 మంది ప్రాణాలు కోల్పోగా, 4.76లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2.7లక్షలుగా ఉంది.

English summary
A complete lockdown has been ordered in Patna from July 10 to July 16 due to a sudden spurt in novel coronavirus cases, officials said on Wednesday. Bihar reported its highest single-day spike of 749 COVID-19 cases, of which Patna alone accounted for 235.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X