వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుఖోయ్ - 30 యుద్ద విమానం విన్యాసాలు.. మీరూ ఓ లుక్కేయండి (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : గగన తలంలో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానం సందడి చేసింది. ఎయిర్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యుద్ధ విమానం విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గాల్లో ఎగురుతూ పలు రకాల ఫీట్లు చేసిన సుఖోయ్ 30 యుద్ద విమానానికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని హిందన్ వైమానిక స్థావరంలో.. ఎయిర్ మార్షల్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియాకు సెల్యూట్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు సమాచారం.

ఆర్టీసీపై కుట్ర.. సమ్మెకు ప్రభుత్వమే కారణం.. కార్మిక జేఏసీ నిప్పులుఆర్టీసీపై కుట్ర.. సమ్మెకు ప్రభుత్వమే కారణం.. కార్మిక జేఏసీ నిప్పులు

భారత వైమానిక దళం 87వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఎయిర్ ఫోర్స్ అధికారులు వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. హిందన్ స్థావరం కేంద్రంగా వివిధ రకాల యుద్ద విమానాలతో వైవిధ్య భరితమైన విన్యాసాలతో ప్రదర్శన నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు మరో రెండు రోజుల్లో గగన తలంలో ఈ విన్యాసాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఆ క్రమంలో గెట్ రెడీ అంటూ భారత వైమానిక దళం ట్వీట్ చేయడం విశేషం. అయితే దీనికి సంబంధించిన ప్రొమో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 sukhoi 30 mki fight aeroplane promo video by IAF

మరో రెండు రోజుల్లో యుద్ద విమానాలు, రవాణా విమానాలు గాల్లో ఎగురుతూ సందడి చేయనున్నాయి. వింటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్ జెట్‌లు కూడా ప్రదర్శనలో భాగం కానున్నాయి. అంతేకాదు ఈ ప్రదర్శన సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరో బాటిక్ బృందంతో పాటు సారంగ్ హెలికాప్టర్ టీమ్ కనబరిచే అద్భుత సాహస విన్యాసాలు వీక్షకులను కట్టిపడేయనున్నాయి. సుఖోయ్ యుద్ద విమానం విన్యాసాలకు సంబంధించిన ఫుల్ వీడియో వీక్షించాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

English summary
sukhoi 30 mki fight aeroplane Promo video on the occasion of 87th Anniversary of Indian Air Force.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X