వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం మీద ఈసీకి ఫిర్యాదు చేసిన సుమలత, ఫ్యాన్ ట్యాపింగ్, ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ నిఘా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ముఖ్యమంత్రి కుమారస్వామి అధికార దుర్వినియోగంతో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, తన మీద కక్ష సాధిస్తున్నారని మండ్య లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, ప్రముఖ నటి సుమలత ఆరోపించారు.

లోక్ సభ ఎన్నికల్లో సుమలతకు బీజేపీ మద్దతు, చాల సంతోషం, జేడీఎస్, కాంగ్రెస్ కు షాక్, ఓటర్లు!లోక్ సభ ఎన్నికల్లో సుమలతకు బీజేపీ మద్దతు, చాల సంతోషం, జేడీఎస్, కాంగ్రెస్ కు షాక్, ఓటర్లు!

ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అధికార దుర్వనియోగం చేస్తున్నారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని సుమలత ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మీద ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన సుమలత అనంతరం మీడియాతో మాట్లాడారు.

 Sumalatha Amabreesh accused that CM Kumaraswamy using his power and taping my phone calls

బెంగళూరులోని తన ఇంటి చుట్టుపక్కల ఇంటెలిజెన్స్ పోలీసులు సంచరిస్తున్నారని, ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి ముఖ్యమంత్రి కుమారస్వామికి సమాచారం ఇస్తున్నారని సుమలత ఆరోపించారు. తాను మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన తరువాత ఇంటెలిజెన్స్ పోలీసులు తన ఇంటి దగ్గర మకాం వేశారని సుమలత ఆరోపించారు.

సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కు షాక్ ఇచ్చిన మాజీ సీఎం సిద్దూ, ఇంటికి వెళ్లి పిలిచినా!సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కు షాక్ ఇచ్చిన మాజీ సీఎం సిద్దూ, ఇంటికి వెళ్లి పిలిచినా!

మీరు జాగ్రత్తగా ఉండాలని, మీ మీద నిఘా వేశారని స్వయంగా జేడీఎస్ పార్టీకి చెందిన వారే తనను హెచ్చరించారని సుమలత అన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మీద చేసిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషన్ అధికారులు హామీ ఇచ్చారని సుమలత మీడియాకు చెప్పారు.

మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన కుమారుడిని ఎంపీగా గెలిపించుకోవడానికి కుమారస్వామి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Mandya constituency independent candidate Sumalatha Amabreesh accused that CM Kumaraswamy using his power and taping my phone calls and he deployed some intelligence department officers around my home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X