బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోక్ సభ ఎన్నికలు: నటి సుమలత ఆస్తులు ఎన్ని రూ. కోట్లు అంటే ? పేరు కోసం కాదు: సుమలత!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, స్యాండిల్ వుడ్ దివంగత రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలత అంబరీష్ మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మండ్య జిల్లా కార్యాలయంలో సుమలత నామినేషన్ సమర్పించారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్ లో సుమలత తన ఆస్తుల విలువ రూ. 23 కోట్లగా పైగా ఉందని, రుణాలు ఇంత ఉన్నాయని వివరించారు.

బీజేపీ అంటే ఇష్టం లేదు, సుమలతకు మద్దతు, సీఎం కొడుకు అవసరమా ? నటుడు ప్రకాష్ రాజ్!బీజేపీ అంటే ఇష్టం లేదు, సుమలతకు మద్దతు, సీఎం కొడుకు అవసరమా ? నటుడు ప్రకాష్ రాజ్!

హీరోలు దర్శన్, యష్

హీరోలు దర్శన్, యష్

నామినేషన్ పత్రాలు సమర్పించిన తరువాత సుమలత చాలెంజింగ్ స్టార్ దర్శన్, కేజీఎఫ్ హీరో యష్, వేల సంఖ్యలో గుమికూడిన అంబరీష్ అభిమానులతో కలిసి మండ్యలోని ప్రముఖ వీదుల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సుమలత పాల్గొన్నారు.

మండ్య కోడలు

మండ్య కోడలు

రాజకీయాల్లోకి వచ్చి తాను కొత్తగా పేరు సంపాదించి గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని సుమలత అన్నారు. తాను మండ్య జిల్లా మళవళ్లి హుచ్చేగౌడ కోడలు, రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, అభిషేక్ తల్లిని అని సుమలత అన్నారు. తాను పేరు ప్రతిష్టల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని, తనకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందని సుమలత అన్నారు.

అభిమానుల కోసం ఎంట్రీ

అభిమానుల కోసం ఎంట్రీ

మండ్య జిల్లా ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సుమలత అన్నారు. పార్టీ ఎదైనా, స్వంతంత్ర పార్టీ అభ్యర్థి అయినా సరే తాము మిమ్మల్ని గెలిపించుకుంటామని మండ్య ప్రజలు ఒత్తిడి చేశారని సుమలత అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అంబరీష్ అన్నను ఆదరించామని, ఆయన లేని లోటును మీరు భర్తి చెయ్యాలని మండ్య ప్రజలు ఒత్తిడి చేశారని సుమలత అన్నారు.

గుంటూరులో చదువు

గుంటూరులో చదువు

* పేరు: సుమలత అమరనాథ్ అలియాస్ సుమలత అంబరీష్

* భర్త పేరు: దివంగత ఎంహెచ్. అమరనాథ్ అలియాస్ అంబరీష్
* కుమారుడు: అభిషేక్ గౌడ
* చిరునామా: బెంగళూరు నగరంలోని జేపీ నగర్, 2వ స్టేజ్, 21వ మెయిన్ రోడ్డు
*. మండ్య జిల్లా మద్దూరు శాసన సభ నియోజక వర్గంలో ఓటు హక్కు
* ఫేస్ బుక్, ట్వీట్టర్, ఇన్ట్సాగ్రామ్ అకౌంట్లు ఉన్నారు.
* ఎలాంటి క్రిమినల్ కేసులు తన మీద లేవు.
* ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోని సంతేష్ జోసఫ్ కాన్వెంట్ స్కూల్ లో 1977-78 సంవత్సరంలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం.

స్థిరాస్తి రూ. 17 కోట్లు ఫ్లస్

స్థిరాస్తి రూ. 17 కోట్లు ఫ్లస్

* స్థిరాస్తి విలువ రూ. 17.72, 91, 150

* రూ. 41, 00, 000 విలువైన వ్యవసాయ భూమి
* బెంగళూరులోని జేపీ నగర్ లో సొంత ఇల్లు, భవనం విలువ రూ. 17, 72, 91, 150
* ఐటీ రిటన్స్ లో ఆర్థిక ఆదాయం రూ. 1,33, 15, 757 చూపించాను


అప్పుల వివరాలు

* సుమలత మొత్తం ఆప్పులు: రూ. 1,42, 32, 295
2. ఎలాంటి సెక్యూరిటీ బాండ్ లు లేకుండా ప్రమీళ అనే మహిళ దగ్గర రూ. 45 లక్షల రుణం తీసుకున్నాను.
* ఎలాంటి సెక్యూరిటీ బాండ్ లు లేకుండా సంతోష్ డీటీ అనే వ్యక్తి దగ్గర రూ. 95 లక్షలు రుణం తీసుకున్నాను.
* స్యాండిల్ వుడ్ మీడియాలో ఎలాంటి సెక్యూరిటీ బాండ్ లేకుండా రూ. 2, 32, 285 రుణం తీసుకున్నాను.
* బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర ఎలాంటి రుణాలు తీసుకోలేదని సుమలత అఫిడవిట్ సమర్పించారు.

English summary
Sumalatha Ambareesh, widow of former minister M.H. Ambareesh today filed nomination for Mandya Lok Sabha constituency as an independent candidate. Here are details of her assets and liabilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X