వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుమలతను పోటీ చేయించింది ఎవరు?: మాజీ ప్రధానికి నో, హీరోకు చాన్స్, అందుకే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తరువాత రెండు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తామని రెండు పార్టీల నాయకులు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో మండ్య నుంచి రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, ప్రముఖ బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు సుమలతను పోటీ చేయించింది ఎవరు ? ఎవరెవరు మద్దతు ఇచ్చారు అనే విషయం ఇప్పుడు బహిరంగంగా వెలుగు చూసింది. కాంగ్రెస్ నాయకులే సుమలతకు ధైర్యం చెప్పి ఆ రోజు పోటీ చేయించారని ఎంపీ చేశారని ఇప్పుడు కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. మేము మాజీ ప్రధాని దేవేగౌడకు చాన్స్ ఇస్తే జేడీఎస్ మాత్రం హీరో నిఖిల్ కుమారస్వామికి చాన్స్ ఇచ్చిందని మండిపడుతున్నారు.

మంచం మీదకు వస్తే మజా చేద్దాం, స్వామీజీ ఆడియో, వీడియోలు వైరల్, భర్త హనీట్రాప్!మంచం మీదకు వస్తే మజా చేద్దాం, స్వామీజీ ఆడియో, వీడియోలు వైరల్, భర్త హనీట్రాప్!

 కాంగ్రెస్ టిక్కట్ కోసం !

కాంగ్రెస్ టిక్కట్ కోసం !

మాజీ మంత్రి, రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, బహుబాష నటి సుమలత మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఆరోజు బలంగా నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించాలని ఆ రోజు సిద్దరామయ్య డాక్టర్ జీ. పరమేశ్వర్, డీకే. శివకుమార్ తదితరుల చుట్టూ సుమలత ప్రదక్షణలు చేశారు. అయితే సుమలతకు టిక్కెట్ ఇవ్వడానికి ఆ నాయకులు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు.

సీన్ రివర్స్

సీన్ రివర్స్

కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని సుమలత సిద్దం అయ్యారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థిగా (జేడీఎస్) మండ్య నుంచి పోటీ చేశారు. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులు నిఖిల్ కుమారస్వామికి మద్దతు ఇవ్వమని బహిరంగా చెప్పి ప్రచారానికి దూరంగా ఉన్నారు. పరోక్షంగా సుమలతకు కాంగ్రెస్ నాయకులు, ప్రత్యక్షంగా కార్యకర్తలు మద్దతు ఇచ్చారు.

పైన పటారం, లోన లోటారం

పైన పటారం, లోన లోటారం

నిఖిల్ కుమారస్వామికి మద్దతుగా కొందరు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల ప్రచారం ఎలా ఉందంటే పైన పటారం, లోన లోటారం అన్నట్లు ఉంది. పైకి నిఖిల్ కుమారస్వామిని గెలిపించండి అని ప్రచారం చేసిన కొందరు కాంగ్రెస్ నాయకులు, మీ ఇష్టం, ఎవరికైనా ఓటు వేసుకోండి అంటూ వారి అనుచరులతో ప్రచారం చేయించారు. ఈ విషయం అప్పట్లోనే వెలుగు చూసింది. అయితే ఈ రోజు మండ్య జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేబీ. చంద్రశేఖర్ ఆ రోజు మేము సుమలతకు మద్దతు ఇచ్చాం అంటూ ఇప్పుడు బహిరంగంగా చెబుతున్నారు.

మాజీ ప్రధానికి చాన్స్

మాజీ ప్రధానికి చాన్స్

గత లోక్ సభ ఎన్నికలు జరిగే సమయంలో మండ్య జిల్లాలో 7 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ముగ్గురు మంత్రులు ఉన్నారు. జేడీఎస్ నాయకులు శివరామేగౌడతో మండ్యలో పోటీ చేయించాలని చెప్పారు. అయితే వారి మాటను జేడీఎస్ పట్టించుకోలేదు. మాజీ ప్రధాని దేవేగౌడతో మండ్య నుంచి పోటీ చేయించాలని చెప్పారు. ఆ మాట పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకుల మాటలు పట్టించుకోలేదు.

కుమారస్వామి పట్టు

కుమారస్వామి పట్టు

అప్పటి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని మండ్య నుంచి పోటీ చేయించడంతో కాంగ్రెస్ నాయకులు, జేడీఎస్ నాయకులు సైతం రగిలిపోయారు. అప్పటి సీఎం కుమారస్వామి కావాలనే సొంత కొడుకును మండ్య నుంచి పోటీ చేయించాలని, గెలిపించుకోవాలని ప్రయత్నించడంతో ఆ రోజు సుమలతకు పరోక్షంగా తాము మద్దతు ఇచ్చామని కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ అన్నారు. జేడీఎస్ కుటుంబ రాజకీయాలు చెయ్యడంతో ఆ పార్టీ మండ్యలో మునిగిపోయిందని కాంగ్రెస్ లీడర్ చంద్రశేఖర్ ఆరోపించారు.

కొంప ముంచిన పొత్తు

కొంప ముంచిన పొత్తు

గత శాసన సభ ఎన్నికల సమయంలో మండ్య జిల్లాలో కుమారస్వామి హవా ఎక్కువగా ఉండేది. అందుకే మండ్యలో 7 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. తరువాత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలతకు మోసం చేసిందని, దాని ఫలితం నిఖిల్ కుమారస్వామి మీద పడిందని కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ బహిరంగంగా చెబుతున్నారు. నిఖిల్ కుమారస్వామి పోటీ చెయ్యడం వలనే సుమలతకు స్థానికులు మద్దతు ఇచ్చి సుమలతను గెలిపించి నేడు ఎంపీ చేశారని చంద్రశేఖర్ గుర్తు చేశారు.

English summary
Karnataka: Sumalatha Contested In Mandya Loksabha constituency. District Congress Leader Now Revealed The Truth And He Said, Congress Indirectly Supported Her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X