వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికల్లో సుమలతకు బీజేపీ మద్దతు, చాల సంతోషం, జేడీఎస్, కాంగ్రెస్ కు షాక్, ఓటర్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న తనకు బీజేపీ భేషరతు మద్దతు ఇవ్వడం చాల సంతోషంగా ఉందని స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు సుమలత అన్నారు. సోమవారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడియూరప్ప ఇంటికి చేరుకున్న సుమలత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా సుమాలత మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి షరతులు పెట్టకుండా తనకు మండ్య లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ నాయకులు మద్దతు ఇస్తున్నారని అన్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం లేదని, తనకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బీఎస్. యడ్యూరప్ప మాట ఇచ్చారని సుమలత తెలిపారు.

Sumalatha met BS Yeddyurappa and thanked BJP leadership for unconditional support for election.

కొంత మంది నటులు దొంగ ఎద్దులు అంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన విమర్శలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యనని, చాలెంజింగ్ స్టార్ దర్శన్ సైతం ఆ విషయంలో మాట్లాడరని సుమలత అన్నారు. తాము పోలంలో కష్టపడి పని చేసే ఎద్దులు అని సుమలత అన్నారు.

తన భర్త దివంగత అంబరీష్ మీద ఉన్న గౌరవంతో మండ్య లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించకుడా ఆ పార్టీ నాయకులు తనకు మద్దతు ఇస్తున్నారని సుమలత అన్నారు. బీజేపీ మద్దతు ఇవ్వడంతో తనకు మరింత బలం వచ్చిందని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో తాను కచ్చితంగా విజయం సాధిస్తానని సుమలత అన్నారు.

మండ్యలో తనకు బీజేపీ మద్దతు ఇవ్వాలని మనసులో అనిపించిదని, ఇప్పుడు అదే నిజం అయ్యిందని సుమలత అన్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో బీజేపీ భషరతు మద్దతు ప్రకటించింది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ పోటీ చెయ్యడం లేదని బీఎస్. యడ్యూరప్ప ప్రకటించారు.

English summary
Karnataka Lok Sabha Elections 2019: Mandya independent candidate Sumalatha met BS Yeddyurappa and thanked BJP leadership for unconditional support for election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X