వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుమలతకు భర్త చచ్చాడనే బాధ లేదు: సీఎం ఫైర్, ఇదే మీ సంస్కారం, మహిళలు అంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో ఏ లోక్ సభ నియోజక వర్గంలో లేని ఎన్నికల వేడి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఉంది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ కుమారస్వామి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ దివంగత అంబరీష్ సతీమణి పోటీ చెయ్యడమే అందుకు కారణం. సుమలతకు భర్త చచ్చాడనే బాధ ఏమాత్రం లేదని సీఎం కుమారస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

శనివారం సుమలత అంబరీష్ మీడియాతో మాట్లాడుతూ భర్త చనిపోయాడనే కనీస బాధ సుమలత ముఖంలో కనపడటం లేదని విమర్శించిన ముఖ్యమంత్రి కుమారస్వామికి సరైన రీతిలో ఆమె సమాధానం ఇచ్చారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి ఈ విధంగా మాట్లాడం సరైన పద్దతేనా ? అని సుమలత ప్రశ్నించారు.

Sumalatha slams CM HD Kumaraswamy says that his comment is an insult to all women.

ఈ రోజు తనకు భర్త లేడని ఈ విదంగా విమర్శించిన ముఖ్యమంత్రి కుమారస్వామి సంస్కారం ఏమిటో అని కర్ణాటక ప్రజలు గమనిస్తున్నారని సుమలత అన్నారు. ఈ రోజు తనకు భర్త లేడని, ఆ బాధ తన ముఖంలో కనపడటేదని విమర్శించిన ముఖ్యమంత్రి కుమారస్వామి మహిళలు అందర్నీ అవమానించారని సుమలత ఆరోపించారు.

మహిళల గురించి ఈ విదంగా మాట్లాడితే సీఎం కుమారస్వామికి పేరు ప్రతిష్టలు రావని సుమలత గుర్తు చేశారు. సీఎం కుమారస్వామికి మండ్య ప్రజలు ఓటుతో సమాదానం చెబుతారని, ఆ రోజు దగ్గరల్లోనే ఉందని సుమలత అంబరీష్ అన్నారు.

కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్.డి. రేవణ్ణ మాట్లాడుతూ భర్త చనిపోయి మూడు నెలల కాకముందో సుమలత ఎన్నికల బరిలోకి వచ్చారని, ఆ అవసరం ఆమెకు ఉందా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైనారు.

ఇప్పుడు రేవణ్ణకు తగ్గ తమ్ముడు అంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి సుమలతను అవమానించారని అంబరీష్ అభిమానులు మండిపడుతున్నారు. మరో వైపు లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి సుమలత విజయం సాధించాలని అంబరీష్ అభిమానులు పోర్లు దండాలు పెట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

English summary
BJP supported independent candidate from Mandya Sumalatha Ambareesh slams Chief minister HD Kumaraswamy says that his comment is an insult to all women. CM had allegedly said that the pain of husband's loss is not visible on her face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X