వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ వరల్డ్ ఏషియా 2019 విజేతగా సుమన్ రావు, ఎవరు ఈమె, నేపథ్యమెంటీ..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచ సుందరి పోటీలను ఎక్సైల్ లండన్‌లో బ్రిటిష్ బ్రాడ్ కాస్టర్ ఎంపికచేసింది. జమైకా సుందరి టోని ఆన్ సింగ్‌ను ప్రపంచ సుందరి కిరీటం వరించిన సంగతి తెలిసిందే. ఆ పోటీల్లోనే మిస్ వరల్డ్ ఏసియాను కూడా నిర్వాహకులు ఎంపికచేశారు. ప్రపంచ సుందరి పోటీల్లో రెండో రన్నరప్‌గా నిలిచిన భారత భామ.. సుమన్ రావు, మిస్ వరల్డ్ ఏసియా కిరీటాన్ని దక్కించుకున్నారు.

మోడల్

మోడల్

సుమన్ రావు (20) మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో మిస్ ఇండియాగా కూడా ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ 2019లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన సుమన్ రావు.. మిస్ వరల్డ్ ఏసియా 2019గా ఎంపికయ్యారు.

రాజస్థానీ

రాజస్థానీ

సుమన్ రావు స్వస్థలం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్.. కానీ ఆమె ఏడాది వయసున్నప్పుడే కుటుంబం ముంబై వచ్చేసింది. సుమన్ రావు తండ్రి జువెల్లర్ కాగా, తల్లి హౌస్ వైఫ్.. సుమన్ రావుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. పాఠశాల విద్య పూర్తికాగానే.. ముంబై వర్సిటీలో అంకౌంటింగ్ కోర్సులో చేరారు. అంతేకాదు కథక్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు.

మిస్ నవీ ముంబై..

మిస్ నవీ ముంబై..

2018లో సుమన్ రావు మిస్ నవీ ముంబై కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. రన్నరప్‌గా నిలువడంతో.. అందాల పోటీల్లో పాల్గొనాలనే ఆశ ఆమెలో రెట్టింపైంది. మరుసటి ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ తరఫున పాల్గొని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అలా ఆమె ప్రస్థానం కొనసాగుతోంది.

లింగ సమానత్వం..

లింగ సమానత్వం..

మిస్ ఇండియా తర్వాత తన వాణిని బలంగా వినిపించారు సుమన్ రావు. లింగ సమానత్వమే తన ఎజెండా అని కుండబద్దలు కొట్టారు. దేశంలో పురుషులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆమె ఖండించారు. అన్నిరంగాల్లో మహిళలకు సమానంగా అవకాశాలు కలిగించాలని కోరుతున్నారు. స్రీలకు స్వేచ్చ, సమానత్వంలో పురుషులతో సమానంగా హక్కులు ఉండాలని బల్లగుద్దీ మరీ చెప్తున్నారు.

 82 వేల మంది ఫాలొవర్లు

82 వేల మంది ఫాలొవర్లు

సుమన్‌రావుకు అభిమానులు కూడా ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమెకు 82 వేల మంది ఫాలొవర్లు ఉన్నారంటే.. ఆమె క్రేజ్ ఎంత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

English summary
suman Rao, who represented India at the Miss World 2019 contest in London on December 14, won the title of Miss World Asia 2019 during the beauty pageant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X