వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమల్‌నాథ్‌తో సుమిత్ర భేటీ.. ఎమ్మెల్యేల చేరికపైనే చర్చ..?

|
Google Oneindia TeluguNews

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాలు మస్తు రంజుమీదున్నాయి. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. ఇప్పటికే ఎంపీ బీజేపీ చీఫ్ రాకేశ్ సింగ్ ఢిల్లీ చేరుకొని .. హైకమాండ్‌తో చర్చిస్తోన్న వేళ .. మాజీ స్పీకర్, బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌తో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వాస్తవానికి మధ్యప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన కార్యక్రమంలో సుమిత్ర మహాజన్ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సీఎం కమల్‌నాథ్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ 50 నిమిషాల పాటు చర్చించడమే హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితులు భేటీ అవడం చర్చకు దారితీసింది. ప్రధానంగా రాజకీయ పరిణామాలపై డిస్కస్ చేసినట్టు సమాచారం. దీంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అహిల్కాబాయ్ మెమోరియల్ భవనం కోసం ఇండోర్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రతిపాదనలు చేసింది. అప్పటి సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ అంగీకారం తెలిపారు. కానీ ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. దీంతో కమల్ నాథ్‌తో సుమిత్ర సమావేశమయ్యారని ఓ అధకారి పేర్కొన్నారు.

sumitra mahajan met mp cm kamalnath

బీజేపీ సీనియర్ నేత, 8 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికైన సుమిత్ర మహాజన్ కు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వేలదు. దీంతో ఆమె సీనియర్ నేతలతో సఖ్యత లేదు. ఈ క్రమంలో కమల్‌తో భేటీ అవడం .. ప్రాజెక్టు అంశమేనా ? అనే చర్చకు దారితీసింది. లేదంటే తాను పార్టీలో చేరికపై డిస్కస్ చేశారా ? లేదంటే బీజేపీ ఎమ్మెల్యేల చేరికపై చర్చించారా అనే అనుమనాలు కలుగుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సుమిత్ర, లేదంటే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది.

English summary
Madhya Pradesh Politics Political developments are changing with the announcement of two BJP MLAs joining the Congress. Former Speaker and BJP senior leader Sumitra Mahajan has been met with CM Kamal Nath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X