చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.... సన్ టీవి సీఓఓని అరెస్టు చేసిన పోలీసులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: మాజీ మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురి చేసినందుకు గాను సన్ టీవి టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సి ప్రవీణ్‌ను శుక్రవారం ఉదయం చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నానగర్‌లోని తన నివాసంలో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే... గతంలో తాను సూర్య టీవిలో ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్‌గా పనిచేసినప్పుడు సీఓఓ ప్రవీణ్ లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఐదు నెలల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసినా.. ఇంకా అతని వేధింపులు కొనసాగుతున్నాయని కంప్లైంట్ చేసింది.

Sun TV COO arrested on sexual harassment charges

ప్రవీణ్, ఆమెను ఏవిధంగా లైంగికంగా వేధించాడనే దానికి ఆధారంగా తన వాట్స్‌అప్ మేసేజ్‌లను, మాట్లాడిన మాటలను పోలీసులకు అందించింది. వాటి ఆధారంగా ప్రవీణ్ ను ప్రశ్నించిన సీసీబీ టీంఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రాధమిక విచారణలో సీఓఓ ప్రవీణ్ మానసికంగా, శారీరకంగా వేధించాడని తెలుస్తోంది.

మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్ సోదరుడైన కళానిధి మారన్ నడుపుతున్న సన్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో న్యూస్ ఎడిటర్ వి. రాజాపై 2013లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

English summary
Sleuths of the central crime branch of the Chennai police on Friday morning arrested the chief operating officer (COO) of Sun TV, C Praveen, on sexual harassment complaints filed by a former staff of the television network.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X