వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్నాబ్‌ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: ఢిల్లీ కోర్టు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Delhi High Court Ordered To Register A Case Against Arnab

ఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నమోదు చేసిన క్రిమినల్ కంప్లయింట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. సునందపుష్కర్ మృతికేసులో విచారణ జరుగుతున్న సమయంలోనే కీలకమైన డాక్యుమెంట్లను దొంగలించి బహిర్గతం చేశారంటూ శశిథరూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తన ఈమెయిల్ అకౌంట్‌ను కూడా హ్యాకింగ్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

శశిథరూర్ ఫిర్యాదు చేసే సమయంలో ఆర్టీఐ నుంచి తీసుకొచ్చిన కొన్ని డాక్యుమెంట్లు అర్నాబ్ గోస్వామి దగ్గరకు ఎలా వెళ్లాయని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్‌ను ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టి అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చాలామందిని విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి అర్నాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది స్టేషన్ హౌజ్ ఆఫీసరే అని కోర్టు స్పష్టం చేసింది. విచారణ చేసి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు ఏప్రిల్ 4వ తేదీకి కేసును వాయిదా వేసింది.

Sunanda Pushkar death case: Court orders FIR on complaint against Arnab Goswami

కేవలం తన వ్యూయర్‌షిప్ పెంచుకునేందుకు సునంద పుష్కర్‌కు చెందిన కొన్ని కీలక డాక్యుమెంట్లను అర్నాబ్ గోస్వామి బహిర్గతం చేశారని శశి థరూర్ తరపున కేసును వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ వికాస్ పహ్వా మరో అడ్వకేట్ గౌరవ్ గుప్తా వాదించారు. అంతేకాదు విచారణకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను కూడా ఛానెల్ ప్రసారం చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాదులు. అంతేకాదు డాక్యుమెంట్లు పోలీసుల దగ్గరమాత్రమే ఉన్నాయని మరి అవి అర్నాబ్ గోస్వామి దగ్గరకు ఎలా వచ్చాయనేదానిపై కూడా లోతైన విచారణ జరగాలని శశి థరూర్ డిమాండ్ చేశారు.

English summary
A Delhi court has ordered registration of an FIR on a criminal complaint filed by Congress Lok Sabha MP Shashi Tharoor, accusing news channel Republic TV and its Editor-in-Chief Arnab Goswami of stealing confidential documents pertaining to the probe into the death of Tharoor’s wife Sunanda Pushkar, and alleged hacking of his e-mail account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X