వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు: శశిథరూర్‌కు ముందస్తు బెయిల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు ముందస్తు బెయిల్ లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు ఆయనకు గురువారం బెయిల్‌ మంజూర్ చేసింది. కాగా, ముందస్తు బెయిల్ కోసం ఆయన లక్ష రూపాయల బెయిల్ బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

సునంద పుష్కర్ మృతి కేసు: ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు శశిథరూర్ సునంద పుష్కర్ మృతి కేసు: ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు శశిథరూర్

శశి థరూర్ దేశాన్ని విడిచి వెళ్లరాదంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. సునందా మృతి కేసులో శనివారం శశి కోర్టు ముందు హాజరుకానున్నారు. అడ్వకేట్ వికాశ్ ఆయన తరపున బెయిల్ పిటీషన్ వేశారు. 2014, జనవరి 7న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా అనుమాస్పద స్థితిలో మృతిచెందింది.

Sunanda Pushkar death case: Shashi Tharoor gets protection from arrest

ఐపీసీలోని సెక్షన్ 498ఏ, 306 కింద శశిపై కేసులను నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 3వేల పేజీల చార్జిషీటును విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు.. జులై 7న కోర్టుకు రావాల్సిందిగా థరూర్‌కు సమన్లు జారీ చేసింది.

థరూర్‌పై విచారణ జరపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్ముతున్నట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ చెప్పారు. సునంధను ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా, బుధవారం శశిథరూర్ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోరడంతో గురువారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

English summary
Delhi's Patiala House Court on Thursday granted anticipatory bail to Former Union minister Shashi Tharoor in connection with the death of his wife Sunanda Pushkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X