వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమస్యల్లో స‌న్నీడియోల్‌..! అన‌ర్హత వేటు తప్పదా...?

|
Google Oneindia TeluguNews

పంజాబ్/హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ న‌టుడు, బీజేపీ ఎంపీ స‌న్నీడియోల్‌పై అన‌ర్హత వేటు త‌ప్పదా..? ఎన్నిక‌ల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆస‌క్తి ఇప్పుడు అంద‌రిలోనూ నెల‌కొంది. ఆయ‌న‌పై అన‌ర్హత వేటు ప‌డే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ న‌టుడు స‌న్నీడియోల్ ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ త‌ర‌ఫున పోటీచేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌స‌భ స్థానం నుంచి గెలిచారు.

కాంగ్రెస్ కంచుకోట‌గా ఉన్న ఈ స్థానంలో బీజేపీ పాగా వేసింది. దాదాపు 80వేల ఓట్ల మెజార్టీతో స‌న్నీ విజ‌యం సాధించారు. అయితే.. ఆయ‌న ఎన్నిక‌ల ఖ‌ర్చు విష‌యంలో ప‌రిమితి దాట‌ర‌న్న విమ‌ర్శలు వ‌చ్చాయి. ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఖ‌ర్చు 70 ల‌క్షలుగా ఎన్నిక‌ల సంఘం నిర్ణయించింది. అయితే.. స‌న్నీ డియోల్ మొత్తంగా 86 ల‌క్షలు ఖ‌ర్చు చేశారని ఎన్నిక‌ల అధికారులు తేల్చారు.దీనిపై వివర‌ణ ఇవ్వాల‌ని ఎన్నిక‌ల సంఘం ఇప్పటికే స‌న్నీ డియోల్‌కు నోటీసులు జారీ చేసింది. ప‌రిమితికి మించి ఖ‌ర్చు చేసి గెలుపొందిన అభ్యర్థి ఎంపీగా ఎన్నికైతే అత‌ని అభ్యర్థిత్వాన్ని ర‌ద్దు చేసే అధికారం ఎన్నిక‌ల సంఘానికి ఉంటుంది.

Sunny diol in problems.!EC may take Unqualified action.?

ప్రస్తుతం ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన నోటీసుల‌కు స‌న్నీ వివ‌ర‌ణ ఇస్తారు. ఆయ‌న వివ‌ర‌ణతో సంతృప్తి చెంద‌ని ప‌క్షంలో ఎంపీగా అన‌ర్హుడిగా ప్రక‌టిస్తారు. అయితే.. అన‌ర్హత ప‌డితే మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లు ఉండ‌దు. రెండో స్థానంలో నిలిచిన వ్యక్తిని విజేత‌గా ప్రక‌టించ‌డం జ‌ర‌గుతుంది. ప్రస్తుతం స‌న్నీపై అన‌ర్హత వేటు ప‌డితే.. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ చీఫ్ సునీల్‌కుమార్ జ‌ఖ‌ర్ విజేత‌గా ప్రకటించ‌డం ఖాయం.

అదే జ‌రిగితే బీజేపీకి పంజాబ్‌లో పెద్ద దెబ్బ ప‌డిన‌ట్లే అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాయ‌బ‌రేలీ, అమేథీ ఎలా కంచుకోట‌లుగా ఉన్నాయో.. గురుదాస్‌పూర్ కూడా ఒక కంచుకోట‌. ఈసారి దాన్ని బ‌ద్దలుకొట్టి బీజేపీ పాగా వేసింది. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న స‌న్నీడియోల్‌పై అన‌ర్హత వేటు ప‌డితే కాంగ్రెస్ మ‌రోసారి ఇక్కడ విజ‌యం సాధించిన‌ట్లు అవుతుంది. మ‌రి ఎన్నిక‌ల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..!!

English summary
Sunny diol won from the Gurdaspur Lok Sabha seat in Punjab.The BJP has been the seat of the Congress. Sunny won with a majority of nearly 80 thousand votes. However, in the case of the recent elections, there were criticisms that crossed the threshold. The electoral committee has decided to elect an MP candidate for Rs 70 lakh. However, election officials have confirmed that Sunny Deol has made a total of 86 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X