• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ సంచలన కామెంట్లు.. అలా చేస్తే ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి ఉంటుందన్న నటి

|
  'Stop the violence'- Sunny Leone on protests

  ఇప్పుడు దేశమంతా జేఎన్‌యూ హింస గురించే మాట్లాడుతోంది. వర్సిటీలో చోటుచేసుకున్న ఘటనలపై వాళ్లకున్న అవగాహనను బట్టి ఎవరికివాళ్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఎలీట్ సెక్షన్ కూడా రోడ్లమీదికొచ్చి విద్యార్థులపై దాడుల్ని నిరసిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న దీపికా పదుకొనె లాంటివాళ్లు కూడా జేఎన్‌యూ స్డూడెంట్లకు బాసటగా నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత మాజీ పోర్న్‌స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూడా జేఎన్‌యూ హింసపై సంచలన కామెంట్లు చేశారు. నిర్భయ దోషులకు ఉరిపైనా స్పందించారు.

  జరిగింది మర్చిపోయి క్యాంపస్‌కు వచ్చేయండి.. JNU సేఫ్ ప్లేస్.. విద్యార్థులకు వీసీ పిలుపు

  చాలా పెద్ద విషయం

  చాలా పెద్ద విషయం

  సాధారణంగా మీడియాకు, వివాదాలకు దూరంగా ఉండే సన్నీ లియోన్.. తొలిసారి ఒక పొలిటికల్ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. గురువారం మీడియా ముందుకొచ్చిన ఆమె.. జేఎన్‌యూలో విద్యార్థులపై దుండగులు హింసకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. దాడికి దారితీసిన కారణాలు, బాధ్యులు ఎవరన్నది పక్కన పెడితే.. వర్సిటీల్లో హింస చోటుచేసుకోవడం చాలా పెద్ద విషయమని సన్నీ అన్నారు.

  అలా కూడా పరిష్కరించుకోవచ్చు..

  అలా కూడా పరిష్కరించుకోవచ్చు..

  జేఎన్‌యూ హింసపై బాలీవుడ్ నటులు ఒక్కొకరుగా గళాలు విప్పుతున్న నేపథ్యంలో దానిపై మీ అభిప్రాయమేంటని మీడియా అడిగిన ప్రశ్నలకు సన్నీ లియోన్ తడుము కోకుండా సమాధానాలు చెప్పారు. ‘‘ఇవాళ మనముందున్న పెద్ద సమస్య హింసను అదుపుచేయడం. నేను ఏనాడూ హింసా మార్గాన్ని నమ్మలేదు. నమ్మను కూడా. రక్తపాతం లేకుండా వివాదాల్ని పరిష్కరించుకోవచ్చని నేను బలంగా నమ్ముతాను'' అని అన్నారు.

  ఆ నొప్పి అందరూ అనుభవిస్తారు..

  ఆ నొప్పి అందరూ అనుభవిస్తారు..

  ‘‘హింసాయుత ఘటనలో ఒకరు గాయపడ్డారంటే.. ఆ నొప్పి వాళ్ల కుటుంబసభ్యులను కూడా బాధిస్తుంది. తమకు భద్రతలేదని విద్యార్థులు భావించే పరిస్థితులు రావడం సరికాదు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నాదొక విన్నపం.. దయచేసి హింస వదిలేద్దాం. ఒకరినొకరు గాయపర్చుకోకుండా వివాదాలను, సమస్యలను పరిష్కరించుకుందాం''అని సన్నీ లియోన్ చెప్పారు.

  నిర్భయ కేసుపై..

  నిర్భయ కేసుపై..

  ఏడేండ్ల కిందట దేశంలో సంచలనం రేపిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్ని ఈ నెల 22న ఉరితీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారంటూ సన్నీని ప్రశ్నిచంగా.. ‘‘కోర్టు తీర్పు వచ్చిన సమయంలో నేను విదేశాల్లో ఉన్నందువల్ల వార్తలను సరిగా ఫాలో కాలేకపోయా. దయచేసిన మీలో ఎవరైనా వివరిస్తే కచ్చితంగా నా అభిప్రాయం చెబుతా''అని సమాధానమిచ్చారు.

  కొనసాగుతోన్న నిరసనలు..

  కొనసాగుతోన్న నిరసనలు..

  ఆదివారం విద్యార్థులపై దుండగుల దాడి తర్వాత నుంచి అట్టుడికిపోతోన్న జేఎన్‌యూలో గురువారం కూడా ఆందోళనలను జరిగాయి. వైస్ చాన్సలర్ జగదీశ్ ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. మండి హౌజ్ నుంచి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం దాకా పాదయాత్రకు బయలుదేరగా.. వారిని వర్సిటీ గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, డీ.రాజా తదితరులు విద్యార్థుల ర్యాలీలో భాగం పంచుకున్నారు.

  English summary
  Condemning the violence that erupted in Jawaharlal Nehru University actor Sunny Leone on Thursday said that the country should find solutions to problems without any violence
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more