వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేట్ ఎస్కేప్: పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన సన్నీలియోన్ (వీడియో)

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్ వెబర్ మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తుండగా వారి విమానం ప్రమాదం అంచున చిక్కు

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్ వెబర్ మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తుండగా వారి విమానం ప్రమాదం అంచున చిక్కుకుంది.

ఆ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానం కుదుపులకు గురైంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జాగ్రత్తగా మారుమూల ప్రాంతంలో దింపేశాడు.

sunny

ఇదే విషయాన్ని చెప్తూ సన్నీ లియోన్ ట్విట్టర్‌లో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. 'విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాం. మేం ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించక ప్రమాదానికి గురికాబోయింది. అయితే పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మమ్మల్ని రక్షించాడు..' అంటూ ఆవీడియోలో పేర్కొంది.

'ప్రస్తుతం మేం మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో ఉన్నాం. కారులో ఇంటికి వెళ్తున్నాం. మేము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు..' అంటూ తాను ఎదుర్కొన్న భయానక ఘటనను వివరించింది.

కారులో సన్నీతో పాటు భర్త డేనియల్ వెబర్, మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. వారు కూడా తాము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. సన్నీ ప్రాణాలతో బయటపడటంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Bollywood actress Sunny Leone, her husband Daniel Weber, and a few of their friends had a narrow escape when their private plane nearly crashed in a remote region of Maharashtra, PTI reported. The actress went on Twitter and said that bad weather was responsible for the near crash of their flight. The Bollywood star informed her followers on Twitter that she and her team narrowly escaped what could have been a serious accident. Sunny Leone shared a video on Twitter and spoke about how she and her team faced the unforeseen incident due to bad weather in some remote area of Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X