sunny leone mumbai bollywood actress husband car number wife police arrest traffic movie road cash సన్నీ లియోన్ ముంబాయి బాలీవుడ్ నటి భర్త కారు భార్య పోలీసు అరెస్టు ట్రాఫిక్ సినిమా రోడ్డు డబ్బు
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
ముంబాయి/ బెంగళూరు: సన్నీ లియోన్ పేరు తెలియని కుర్రకారు ఉండరంటే నమ్మడం చాలా కష్టం. శృంగార తారగా ఫేమస్ అయిపోయిన నటి సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్‌కు ఓ వ్యక్తి స్పాట్ పెట్టాడు. స్పాట్ అంటే అతనిపై పగ పెంచుకోవడం కాదు. సన్నీ లియోన్ భర్త ఉపయోగిస్తున్న కారు నెంబర్ అతని కారుకు తగిలించుకుని రింగరింగరింగారింగా అంటూ తిరిగేశాడు. కారు ఓనర్ దెబ్బకు పోలీసులు హడలిపోయారు. ఎన్ని ఫైన్లు వేసినా ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఆగడాలు ఎక్కువ కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. కారు ఎవరిది అని ఆరా తీసిన పోలీసులు ఆ ఖరీదైన కారు సన్నీ లియోన్ భర్దది అని వెలుగు చూసింది. తీరా చూస్తే ఆ కారు నడిపింది ఎవరు ? అనే విషయం తెలుసుకున్న పోలీసులు, సన్నీ లియోన్ ఫ్యామిలీ హడలిపోయింది.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో లేడీ టీచర్, డ్రాయింగ్ టీచర్ బొమ్మ రివర్స్!

హాట్ హాట్ సన్నీ లియోన్
శృంగార తారగా పేరుపొందిన నటి సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్‌కు ముంబాయిలోని ఓ వ్యక్తి షాకిచ్చాడు. డేనియల్ వెబెర్‌కు సంబంధించిన కారు నంబర్ తన కారుకు పెట్టుకుని ముంబాయిలో ఇష్టం వచ్చినట్లు తిరిగేశాడు. దీంతో ముంబాయి ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు భారీగా చలాన్లు (ఫైన్లు) వేస్తూనే ఉన్నారు.

దేవుడా... ఏమిటిది ?
సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్ కారు డ్రైవర్ అక్బర్ ఖాన్. అక్బర్ ఖాన్ ఇటీవల ముంబాయిలో ఒకచోట అచ్చం తన యజమాని డేనియల్ కారు నంబర్ పెట్టుకున్న ఓ కారును గుర్తించాడు. దీన్ని చూసి షాక్‌కు గురైన అక్బర్ ఖాన్ వెంటనే ముంబాయి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ముంబాయి పోలీసులు ఆ కారును నెంబర్ ను ట్రాప్ చేశారు.

పీయూష్ సేన్ దెబ్బ
ముంబాయి ట్రాఫిక్ పోలీసులు ఆ కారును ట్రాప్ చేసి పట్టుకోగా పీయూష్ సేన్ అనే వ్యక్తి ఆ కారులో ఉన్నాడు. పీయూష్ సేన్ సన్నీ లియోన్ భర్త డేనియల్ కారు నంబర్‌ను తన మెర్సిడెస్ బెంజ్ కారుకు పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆ కారులో పియూష్ సేన్ విచ్చలవిడిగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరగడంతో ముంబాయి ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేశారు. అయితే ట్రాఫిక్ పోలీసులు వేసిన ఫైన్ చలాన్లు అన్నీ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్‌కు వెళ్లాయి.

ఎవరి పేపర్లు వాళ్లవే
పీయూష్ సేన్ ముంబాయి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అతడి కారు పత్రాలు పరిశీలించారు. పీయూస్ సేన్ చూపించిన పత్రాలు, అతని కారు వివరాలు ఫ్రాండ్ అని వెలుగు చూసింది. బాలీవుడ్ నటి సన్నీ లియోన్ భర్త డేనియల్ కూడా స్టేషన్‌కు వచ్చి పత్రాలు సమర్పించాడు. డేనియల్ కారు పేపర్ల వివరాలు సక్రమంగా ఉన్నాయని ముంబాయి పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మేడమ్ మొగుడికే త్రీడి సినిమా
ఇతరుల కారు నంబర్లు తన కారుకు పెట్టుకున్న పీయూష్ సేన్ ముంబాయి నగరంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. గతంలో కూడా ముంబాయిలోని ప్రముఖుల కారు నెంబర్లు తన కారుకు తగిలించుకుని పీయూష్ సేన్ ముంబాయి రహదారుల్లో రెచ్చిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద సన్నీ లియోన్ మొగుడికే సినిమా చూపించిన పీయూష్ సేన్ పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్ అయ్యింది.