రూ.5వేల నుంచి రూ.10 వేల మధ్య ధరలు, కానీ: 'సన్నీ లియోన్ నైట్స్'కు హెచ్చరిక
బెంగళూరు: నూతన ఏడాది సందర్భంగా బెంగళూరులో నిర్వహించతలపెట్టిన సన్నీ లియోన్ కార్యక్రమానికి అనుమతులు లేవని నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ శనివారం నాడు వెల్లడించారు. బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులోని టెక్ పార్కులో సన్నీ లియోన్ నైట్స్ పేరిట కార్యక్రమానికి అనుమతులు మంజూరు చేయలేదని తెలిపారు.
నటి సన్నీ లియోన్ గతంలో కేరళకు వెళ్లిన సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టి వాహనం వెళ్లకుండా ఆటంకం కలిగించారని ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా నగరంలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు.
పోలీస్ కమిషనర్ హెచ్చరిక
తాము ఇఫ్పటి వరకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సునీల్ వెల్లడించారు. పోలీసుల అనుమతి లేకుంటా సన్నీ నైట్స్‌ను నిర్వహిస్తే నిర్వాహకులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే ప్రచారం చేశారు
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు సన్నీ లియోన్ ఆట, పాటలతో సన్నీ నైట్స్‌ను నిర్వహిస్తున్న టైమ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధులు కవర్ పేజీ, ఇతర ప్రచార మాధ్యమాలలో ఇప్పటికే ప్రచారం చేసుకున్నారు.
అశ్లీల నృత్యాలతో ఆహ్వానించడం
సన్నీ నైట్స్‌కు రూ.ఐదు వేల నుంచి రూ.10వేల మధ్య టిక్కెట్ ధరలను నిర్ణయించారు. కొత్త సంవత్సరాన్ని అశ్లీల నృత్యాలతో ఆహ్వానించడం, కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపిస్తూ కన్నడ సంఘాలు నగరంలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
మంత్రి నో చెప్పారు
కాగా, అంతకుముందు సన్నీ లియోన్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వవద్దని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని తాను అధికారులను ఆదేశించానని, కన్నడ సంస్కతి, సాహిత్యానికి సంబంధించి కార్యక్రమాలను ఈవెంట్ నిర్వాహకులు చేపట్టాలని మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.