• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యల వివాదం: జాగ్రత్త అన్న సన్నీలియోన్, నేర్చుకోవాలన్న రాఖీ సావంత్

By Ramesh Babu
|

ముంబై: మహిళా దినోత్సవం సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది.

అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రామ్ గోపాల్ వర్మపై గోవా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ముంబైలో అతడి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని బాలీవుడ్ కార్మిక వర్గాలు కూడా హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఇటు సన్నీలియోన్, అటు బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ కూడా స్పందించారు.

ఇంతకీ ఏమన్నాడంటే...

ఇంతకీ ఏమన్నాడంటే...

మహిళా దినోత్సవం రోజున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో మహిళలకు శుభాకాంక్షలు చెబుతూనే వివాదాస్పద ట్వీట్ చేశాడు. ‘‘మగవాళ్లందరి తరఫున మహిళలకు ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ చెబుతున్నా. ఏడాదిలో ఒక రోజు ఉమెన్స్ డే పాటించాలి. అయితే ఈ రోజంతా పురుషులేం చేస్తారో నాకు తెలియదు. మహిళలందరూ సన్నీ లియోన్ లా పురుషులకు ఆనందం పంచాలి.. '' అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

చెప్పుతో కొడతాం...

చెప్పుతో కొడతాం...

మహిళలపై చేసిన వ్యాఖ్యలకు రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నాయకురాలు విద్యా చవాన్ డిమాడ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే వర్మను చెప్పులతో కొడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

పోలీసులకు ఫిర్యాదు...

పోలీసులకు ఫిర్యాదు...

మరోవైపు రామ్ గోపాల్ వర్మ చేసిన అనుచిత ట్వీట్ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయింది. మహిళలను కించపరిచేలా సన్నీలియోన్ పేరుతో వ్యాఖ్యలు చేసిన అతడిపై చర్య తీసుకోవాలని కోరుతూ సామాజిక ఉద్యమ కర్త విశాఖ మాంబ్రే గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చివరికి క్షమాపణ...

చివరికి క్షమాపణ...

మహిళా దినోత్సవం నాడు తాను చేసిన ట్వీట్ పై ఇంత గొడవ జరగడంతో రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గారు. ఒకవైపు పోలీసులకు ఫిర్యాదు, మరోవైపు ఎన్సీపీ నాయకురాలి ఘాటైన కామెంట్, ఇంకోవైపు వర్మ తీసే సినిమాలకు పనిచేయకూడదని సినిమా సెట్టింగ్, దాని అనుబంధ కార్మికుల సంఘం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఇక లాభం లేదనుకుని దిగి వచ్చారు.

కొన్ని షరతులతో కూడిన క్షమాపణలు చెప్పేశాడు. తాను చేసిన ట్వీట్ల వల్ల నిజంగా ఎవరైనా మనస్థాపం చెంది ఉంటే వారందరికీ తాను క్షమాపణ చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు. అదే సమయంలో ప్రచారం కోసం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకునే వారికి మాత్రం తాను క్షమాపణ చెప్పడం లేదన్నారు.

జాగ్రత్తగా మాట్లాడాలి...

జాగ్రత్తగా మాట్లాడాలి...

వర్మ వ్యాఖ్యలపై బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ పరోక్షంగా స్పందించింది. ఒక వీడియో మెసేజ్ ద్వారా తన స్పందన తెలియజేసింది. అయితే అందులో వర్మ పేరు ఆమె ప్రస్తావించలేదు. ‘‘ప్రస్తుత వార్తలన్నింటినీ చదువుతున్నాను. మాట మీద నిలబడినప్పుడే మార్పు వస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి..'' అని ఆ వీడియో మెసేజ్ లో పేర్కొంది సన్నీలియోన్.

ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుంటారు...

ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుంటారు...

ఒకపక్క మహిళా లోకం మొత్తం రామ్ గోపాల్ వర్మపై దుమ్మెత్తిపోస్తుంటే.. బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ మాత్రం వర్మకు తన మద్దతు ప్రకటించింది. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రామ్ గోపాల్ వర్మ చెప్పింది కరెక్టే. సన్నీ లియన్ మాదిరిగా మహిళలు ఆనందాన్ని పంచాలనే ఆయన వ్యాఖ్యలకు నేను మద్దతు తెలుపుతున్నాను. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు మహిళలు ఆనందం ఎలా పంచాలో నేర్చుకోవాలి..'' అని వ్యాఖ్యానించింది.

పొగిడిందా? తిట్టిందా?

పొగిడిందా? తిట్టిందా?

అయితే రాఖీ మాటల్లో రామ్ గోపాల్ వర్మకు మద్దతు కన్నా.. వ్యంగ్యమే ధ్వనించింది. ఇన్నాళ్లూ మహిళలు వంటగది బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నారని.. ఇక నుంచి పురుషులకు ఆనందం ఎలా పంచాలో కోచింగ్ తీసుకుంటారు, అవసరమైతే కోచింగ్ క్లాసులకు వెళ్లి నేర్చుకుంటారన్న ఆమె మాటల్లో రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపట్ల వెటకారమే ఎక్కువగా కనిపించింది.

English summary
Actor Sunny Leone has finally addressed the controversy that sparked after filmmaker Ram Gopal Varma posted a tweet mentioning her on International Women’s Day. RGV, (in)famous for his posts online, wrote, “I wish every woman gives a man same happiness like Sunny Leone gives.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X