• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

‘సెక్స్ టాయ్స్ వాడండి, సన్నీలియోనే ఆదర్శం’: విద్యార్థినులతో కీచక ప్రిన్సిపాల్ పైశాచికం

|

బెంగళూరు: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన గురువు స్థానంలో ఉన్న ఓ ప్రిన్సిపాల్ కీచకుడిలా మారిపోయాడు. విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. చివరికి ఓ బాధిత విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో అతని బాగోతం బట్టబయలైంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

'బాయ్‌ఫ్రెండ్‌ను పట్టుకో. సన్నీ లియోన్‌ ఆదర్శంగా తీసుకో. శృంగార సాధనాలు వాడు. నన్ను తరచూ కలుస్తూ ఉండు. నేను నీకు నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తా. నా మాట వినలేదనుకో.. నీకు క్లాస్‌ ఫస్ట్‌ మార్కులు వచ్చే అవకాశాలు కోల్పోతావు' .. అంటూ ఓ విద్యార్థినితో సదరు ప్రిన్సిపాల్‌ అతినీచంగా చెప్పిన మాటలవి.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని సీవీ రామన్‌ రోడ్డులో ఉన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ కుమార్‌ ఠాకూర్‌ తన పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ 12వ తరగతి విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 26న రాత్రి 7.20 గంటల నుంచి 8.10 మధ్య ఈ ఘటన జరిగింది.

Sunny Leone should be role model, use sex toys: B’luru principal to student

ఫిజిక్స్‌ టీచర్‌ షణ్ముగం తనను ప్రిన్సిపాల్‌ చాంబర్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనను తరచూ కలువాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు ప్రిన్సిపాల్‌ చాక్లెట్‌ ఇచ్చాడని, ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే బయట లైట్లు కూడా లేవని తెలిపింది.

కేంద్రీయ విద్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూడటంతో నిపుణులు, డీపీఐ అధికారులు శుక్రవారం విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాధిత విద్యార్థినిపై లైంగిక వేధింపులకు మునుపే ప్రిన్సిపాల్‌పై పలు ఫిర్యాదులు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు అందడం గమనార్హం.

పదో తరగతి నుంచి 12వ తరగతి అమ్మాయిలను ప్రిన్సిపాల్‌ కుమార్‌ ఠాకూర్ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని కేవీ ఉద్యోగి ఒకరు చెల్డ్‌ హెల్ప్‌లైన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సంచలనం సృష్టించిన ఈ లైంగిక వేధింపుల ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు కుమార్‌ ఠాకూర్‌కు జారీచేసిన బెయిల్‌ రద్దు చేయాలని నోడల్‌ చెల్డ్‌హెల్ప్‌లైన్‌ అధికారులు బెంగళూరు డీసీపీకి లేఖ రాశారు. ఇప్పటికైనా నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

English summary
“Have a boyfriend, Sunny Leone should be your role model, use sex toys, meet me often, I will give you all possible moral, social and financial support and if not, you will lose all chances of securing first class marks,” is what Kumar Thakur, principal, Kendriya Vidyalaya CV Raman Road, Sadashivanagar, allegedly told a XII standard girl student from his school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more