వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Super sketch: భార్య బోరుకొట్టింది, కరోనా పాజిటివ్, చచ్చిపోతా, హ్యాపీగా ఉండు, ఇండోర్ లో లవర్ తో !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ఇండోర్: కరోనా వైరస్, లాక్ డౌన్ పుణ్యమా అంటూ దేశంలో అక్కడక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చూస్తున్న కొందరు నవ్వుకుంటుంటే, కొందరు అయ్యో పాపం అంటున్నారు. ప్రియురాలితో జల్సాలు చెయ్యడానికి ఇంతకాలం బోరుకొట్టిన భార్య అడ్డుగా ఉందని ఓ మహానుభావుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. వెంటనే అతనికి రామ్ రాజ్ బనియన్లు, చెఢ్డీలు లాంటి ఐడియా వచ్చింది. భార్య దగ్గరకు వెళ్లి ఏమే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, నేను ఎక్కువ కాలం బతకను అని డాక్టర్లు చెప్పారు, నేను చనిపోయినా నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండాలి అంటూ ఇవీవీ సత్యనారాయణ సినిమాలోని డైలాగ్ చెప్పి మాయం అయ్యాడు. భార్య ఫిర్యాదు చెయ్యడంతో మామలు రంగంలోకి దిగి ఎంట్రీ ఇవ్వడంతో ఇండోర్ లో ప్రియురాలితో కలిసి జల్సా చేస్తున్న కేటుగాడు అడ్డంగా చిక్కిపోయాడు. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడానికి కిలాడీకేటుగాడు వేసిన సినిమా స్కెచ్ తెలుసుకున్న పోలీసులు, భార్య షాక్ కు గురైనారు.

TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

ముంబాయిలో సంసారం

ముంబాయిలో సంసారం

మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోంది. ఇక ముంబాయి రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరంలో కరోనా వైరస్ భరతనాట్యం చేస్తోంది. నవీ ముంబాయిలోని తలోజా ప్రాంతంలో 28 ఏళ్ల వయసు ఉన్న రాజేష్ ఖన్నా ( పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నాడు. రాజేస్ ఖన్నా భార్య రేఖ (పేరు మార్చడం జరిగింది). రాజేష్ ఖన్నా, రేఖ దంపతులు వివాహం జరిగిన తరువాత కొన్ని సంవత్సరాలు సంతోషంగా జీవితం గడిపారు.

రాజేష్ ఖన్నా లవర్ రంగీల

రాజేష్ ఖన్నా లవర్ రంగీల

రాజేష్ ఖన్నాకు రంగీల టైపులో ఊర్మిల అనే లవర్ ఉంది. ఉద్యోగానికి వెలుతున్నాను అని ఇంటి నుంచి బయటకు వెలుతున్న రాజేష్ ఖన్నా సాయంత్రం వరకు ఉద్యోగం చేసేవాడు. ప్రతినిత్యం రాత్రి పొద్దుపోయే వరకు ప్రియురాలు ఊర్మిలతో ఎంజాయ్ చెయ్యడం తరువాత ఇంటికి వెళ్లడం చేస్తున్నాడు. రాజేష్ ఖన్నాకు నిత్యం ఇదే పనైపోయింది.

భార్య బోరుకొట్టిందని కరోనా ఐడియా

భార్య బోరుకొట్టిందని కరోనా ఐడియా

భార్య రేఖతో కాపురం చేసి విసిగిపోయిన రాజేష్ ఖన్నా ఎలాగైనా ఆమె పీడవదిలించుకుని ప్రియురాలు ఊర్మిలతో కలిసి ఎంజాయ్ చెయ్యాలని నిర్ణయించాడు. అంతే మంచి రోజు చూసి మాస్టర్ ప్లాన్ వేశాడు. జులై 21వ తేదీ రాజేష్ ఖన్నా నేరుగా ఇంటికి వెళ్లాడు. తాను వైద్యపరీక్షలు చేయించుకున్నానని, నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తాను ఎక్కువ రోజులు బతకను అని డాక్టర్లు తేల్చి చెప్పారని, నేను చనిపోయినా నువ్వు సంతోషంగా జీవించాలని ఇవీవీ సత్యనారాయణ సినిమాలో లాగా భారీ డైలాగులు చెప్పాడు.

మాయలోడు ప్లాన్ మామూలుగా లేదు

మాయలోడు ప్లాన్ మామూలుగా లేదు

నువ్వు ధైర్యంగా ఉండాలని, కరోనా వైరస్ నిన్ను ఏమి చెయ్యదని భార్య రేఖ భర్త రాజేష్ ఖన్నాకు ధైర్యం చెప్పింది. భార్యకు మాయమాటలు చెప్పిన రాజేష్ ఖన్నా బైక్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి రాజేష్ ఖన్నా ఇంటికి వెళ్లలేదు. మరుసటి రోజు భార్య రేఖ సోదరుడు (రాజేష్ ఖన్నా బావ) అతని కోసం గాలించాడు. ముంబాయిలోని వాషీ ప్రాంతంలో రాజేష్ ఖన్నా బైక్, ఆ బైక్ తాళం, హెల్మెట్, ఆఫీసు బ్యాగు, ఆఫీసు ఐడీ కార్డు అన్ని అక్కడే ఉండటం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేష్ ఖన్నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆ భయంతో అతను మాయం అయ్యాడని, మాకు భయంగా ఉందని అతని భార్య రేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఎవడికి కరోనా పాజిటివ్ ?

ఎవడికి కరోనా పాజిటివ్ ?

రాజేష్ ఖన్నా మొబైల్ ఫోన్ స్వీచ్ ఆఫ్ వచ్చింది. ముంబాయి అసిస్టెంట్ కమిషనర్ వినాయక్ సైతం రంగంలోకి దిగారు. ముంబాయిలోని అన్ని COVID-19 పరీక్షా కేంద్రాల్లో 28 ఏళ్ల వయసు ఉన్న తలోజా నివాసి రాజేష్ ఖన్నా అనే వ్యక్తికి ఏమైనా కరోనా పాజిటివ్ అని వచ్చిందా ? అని ఆరా తీశారు. రాజేష్ ఖన్నా పేరుతో ఎవ్వరికీ కరోనా పాజిటివ్ అని రాలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అప్పటి నుంచి రాజేష్ ఖన్నా కోసం నవీ ముంబాయి పోలీసులు గాలిస్తున్నారు.

ఇండోర్ లో రంగీలాతో మస్త్ మజా

ఇండోర్ లో రంగీలాతో మస్త్ మజా

రాజేష్ ఖన్నా ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే కోణంలో దర్యాప్తు చేసి గాలించినా అతని శవం కూడా చిక్కలేదు. ఇన్స్ పెక్టర్ సంజీవ్ ధూమల్ రంగంలోకి దిగారు. ఓ రోజు రాజేష్ ఖన్నా మొబైల్ ఇండర్ లో ఉపయోగిస్తున్నారని సెల్ ఫోన్ టవర్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇండోర్ వెళ్లిన పోలీసులు షాక్ కు గురైనారు. రాజేష్ ఖన్నా పేరు మార్చుకుని అతని ప్రియురాలు ఊర్మిలతో కలిసి అద్దె ఇంటిని తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసుల దిమ్మతిరిగిపోయింది.

Recommended Video

నష్ట పరిహారం కోసం Kangana Ranaut డిమాండ్!! || Oneindia Telugu
తమిళ థ్రిల్లర్ సినిమా స్కెచ్

తమిళ థ్రిల్లర్ సినిమా స్కెచ్

రాజేష్ ఖన్నాకు బెండ్ తీసిన పోలీసులు అతన్ని పట్టుకుని వచ్చి ముంబాయిలోని అతని భార్య రేఖకు అప్పగించారు. కుటుంబ సభ్యులు, పోలీసులకు చెమటలు పట్టించిన రాజేష్ ఖన్నా మీద పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. మొత్తం మీద కరోనా పాజిటివ్ నాటకంతో రాజేష్ ఖన్నా తమిళ థ్రిల్లర్ సినిమా కథను మించిపోయే అద్బుతమైన స్టోరీ అల్లాడని పోలీసులు అన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది

English summary
Coronavirus: In a bizarre incident, a 28-year-old married man from Maharastra's Navi Mumbai lied to his wife about testing positive for the novel coronavirus, travelled to Indore and was finally traced by police officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X