వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ చిచ్చు: రజనీకాంత్ ఇంటికి భారీ బందోబస్తు

|
Google Oneindia TeluguNews

చెన్నై: కావేరీ జలాల పంపిణి విషయంలో, బెంగళూరులో తమిళులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తమిళనాడు బంద్ నిర్వహించారు. బంద్ సందర్బంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

రజనికాంత్ తోపాటు ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు ప్రభుదేవా, యాక్షన్ కింగ్ 'జంటిల్ మెన్' అర్జున్ ఇళ్ల దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనాకారులు అటు వైపు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Super Star Rajinikanth latest news

కర్ణాటకలో పుట్టి పెరిగిన రజనీకాంత్ బెంగళూరులో విద్యాభ్యాసం చేసి బీటీఎస్ లో కండెక్టర్ గా పని చేశారు. తరువాత తమిళనాడు వెళ్లి తమిళ సినీ రంగంలో వచ్చిన అవకాశాలను సధ్వినియోగం చేసుకుని సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు.

కావేరీ జలాల విషయంలో గత కొన్ని దశాభ్ధాలుగా కర్ణాటక-తమిళనాడు మధ్య వివాదం ఉంది. ఈ నేపధ్యం జరిగిన ఆందోళనలు తారాస్థాయికి చేరిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి రావడంతో రజనీకాంత్ ఇంటికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అదే విధంగా కర్ణాటక నుంచి వెళ్లి తమిళ సినీ రంగంలో స్థిరపడిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (అర్జున్) ఇంటి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రజనీకాంత్ దిష్టి బొమ్మలు దగ్ధం చెయ్యడానికి కొందరు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

English summary
Cauvery dispute: Super Star Rajinikanth latest news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X