• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Super Story: ఇద్దరు భర్తలు, మూడు కేసులు, బతుకు బస్ స్టాండ్, డ్రైవర్ బండి బాగా తోలాడని, క్లైమాక్స్ !

|

చెన్నై/ కోయంబత్తూరు/ కొడైకెనాల్: ఇంట్లో చూసిన అబ్బాయితో అమ్మాయి పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ కాపురం పెట్టారు. భర్తకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో భర్తను చూసుకోవడానికి భార్య తోడుగా ఉండేది. అదే సమయంలో పరిచయం అయిన యువకుడితో భార్య ప్రేమలో పడింది. ఆసుపత్రి నుంచి భర్త డిశ్చార్జి అయిన తరువాత కొంత కాలం ప్రియుడితో తిరిగిన భార్య చివరికి అతనితో వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగడంతో కేసు అనేక మలుపులు తిరిగింది. పోలీసులు మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. భార్య తల్లిదండ్రులు, మొదటి భర్త, రెండో భర్త మీద ముచ్చటగా మూడు కేసులు పెట్టి అందర్నీ లోపల వేశారు. అందరూ జైలుకు పోవడంతో రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువతి బతుకు బస్ స్టాండ్ అయ్యింది.

family: అత్త, కోడలు టీవీ సీరియల్ ఫైటింగ్, నీ మొగుడు ఎవడే, నువ్వు పెద్ద పతివ్రతవా ?, దెబ్బకు ఫినిష్!

 అమ్మాయికి అప్పుడే పెళ్లి

అమ్మాయికి అప్పుడే పెళ్లి

తమిళనాడులోని పరిశ్రమల హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న కోయంబత్తూరులోని శరవణపట్టిలో నివాసం ఉంటున్న పెరియస్వామి అనే వ్యక్తికి కావ్య (పేరు మార్చడం జరిగింది) అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం కావ్యకు 17 సంవత్సరాలు. కావ్యకు 15 ఏళ్ల వయసు ఉన్న సమయంలోనే ఆమెకు పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 2018లో మొదటి మొగుడు ఎంట్రీ

2018లో మొదటి మొగుడు ఎంట్రీ

కుటుంబ సభ్యులు చూసిన రాజేష్ అనే వ్యక్తితో 2018లో కావ్య వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోయినా అప్పట్లో కావ్య నోరు మెదపకుండా రాజేష్ ను పెళ్లి చేసుకుంది. దిండుగల్ ప్రాంతంలో రాజేష్ వెల్డర్ గా పని చేస్తున్నాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా భర్త రాజేష్ తో కావ్య కాపురం చేస్తూ వచ్చింది.

 హలో... ఐయామ్ శివ

హలో... ఐయామ్ శివ

రాజేష్ కు అనారోగ్యంగా ఉండటంతో అతన్ని వట్టలకుండు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. భర్త రాజేష్ కు తోడుగా ఉండటానికి కావ్య కూడా ఆసుపత్రిలోనే ఉండేది. ఆ సమయంలో లారీ డ్రైవర్ గా పని చేస్తున్న శివ అనే వ్యక్తి అతని బంధువును చూడటానికి అదే ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సందర్బంలో లారీ డ్రైవర్ శివ కావ్యను పరిచయం చేసుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లి వస్తున్న శివ కావ్యను పలకరిస్తూ ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.

 బండి బాగా తోలేశాడు

బండి బాగా తోలేశాడు

వ్యాధి నయం కావడంతో ఆసుపత్రి నుంచి రాజేష్ డిశ్చార్జి అయ్యాడు. తరువాత కావ్యకు ఫోన్ లు చేసి మాట్లాడుతున్న శివ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇలా భర్త రాజేష్ పనికి వెళ్లిన తరువాత ఇంటి నుంచి బయటకు వెలుతున్న కావ్య ప్రియుడు శివతో కలిసి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇటీవల రాజేష్ కు భార్య కావ్య విషయం తెలిసిపోయింది.

 పోరా నువ్వు కాకపోతే వేరేవాడు

పోరా నువ్వు కాకపోతే వేరేవాడు

నువ్వు మర్యాదగా నాతో కాపురం చేస్తే చెయ్యి, లేదంటే ఇంటి నుంచి బయటకు వెళ్లిపో, ఇలాంటివి తాను చూస్తూ నిన్ను గాలికి వదిలేయలేను అంటూ కావ్యను ఆమె భర్త రాజేష్ హెచ్చరించాడు. భర్త రాజేష్ తో గొడవ పెట్టుకున్న కావ్య పోరా నువ్వు కాకపోతే వేరేవాడు అంటూ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడు శివకు ఫోన్ చేసి చెప్పింది. శివ కావ్యను రెండో పెళ్లి చేసుకుని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన కొడైకెనెనాల్ లో కాపురం పెట్టేశాడు. కావ్య కనపడకపోవడంతో ఆందోళన చెందిన భర్త రాజేష్ పోలీసులను ఆశ్రయించాడు. కావ్య కోసం ఆమె తల్లిదండ్రులు, ఆమె భర్త రాజేష్, పోలీసులు గాలించారు. చివరికి ఆమె కొడైకెనాల్ లో ఉందని గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

 ముచ్చటగా మూడు కేసులు..... బతుకు బస్ స్టాండ్

ముచ్చటగా మూడు కేసులు..... బతుకు బస్ స్టాండ్

కావ్యకు ప్రస్తుతం 17 ఏళ్లు. కావ్య మైనర్ కావడంతో ఆమెను కిడ్నాప్ చేశారని ఆమె తల్లిదండ్రులు, భర్త కేసు పెట్టడంతో శివను అరెస్టు చేశారు. కావ్యకు 15 ఏళ్లలో చట్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేశారని ఆమె తల్లిదండ్రుల మీద కేసు పెట్టారు. 15 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని మొదటి భర్త రాజేష్ మీద కేసు పెట్టారు. తల్లిదండ్రులు, కావ్య మొదటి భర్త రాజేష్, రెండో భర్త శివను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కుటుంబ సభ్యులు, మొదటి భర్త రాజేష్, రెండో భర్త శివ జైలుకు పోవడంతో కావ్య బతుకు బస్ స్టాండ్ అయిపోయింది.

English summary
Super Story: two Coimbatore persons under the pocso act for marrying a 17 year old girl in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X