వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు జైల్లో శశికళ, దర్జాగా షాపింగ్, దెబ్బతో ఐపీఎస్ అధికారిపై వేటు !

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజ్ విషయం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజ్ విషయం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని వెలుగు చూడటంతో నెల క్రితం సిద్దరామయ్య ప్రభుత్వం ఉలిక్కిపడింది.

శశికళను సెంట్రల్ జైల్లో నుంచి బయటకు పిలుచుకెళ్లింది ఇతనే, షాపింగ్ (వీడియో)శశికళను సెంట్రల్ జైల్లో నుంచి బయటకు పిలుచుకెళ్లింది ఇతనే, షాపింగ్ (వీడియో)

ఇప్పుడు శశికళ తన వదిన ఇళవరసితో కలిసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి షాపింగ్ చేసి వెళ్లారని ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఇరుకునపడింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారుల మీద వేటు పడింది.

Superintendent Bengaluru Central Prison transferred

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరెండెంట్, సీనియర్ ఐపీఎస్ అధికారి నిఖమ్ ప్రకాష్ అమ్రిత్ ను కర్ణాటక రిజర్వ్ పోలీసు శాఖకు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శశికళ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారని వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సూపరెండెంట్ నిఖమ్ ప్రకాష్ అమ్రిత్ మీద వేటు వేసింది.

శశికళ కర్మకాండ: బుర్కా వేసుకుని ఎంజీ రోడ్డులో చిన్నమ్మ షాపింగ్, సీసీటీవీ కెమెరాల్లో !శశికళ కర్మకాండ: బుర్కా వేసుకుని ఎంజీ రోడ్డులో చిన్నమ్మ షాపింగ్, సీసీటీవీ కెమెరాల్లో !

శశికళ దెబ్బతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉద్యోగం చేస్తున్న అధికారులు ఎప్పుడు ఏమీ జరుగుతుందో అంటూ హడలిపోతున్నారు. శశికళ వ్యవహారంపై ఇప్పటికే రిటైడ్ ఐఏఎస్ అధికారి ఆధ్వరంలో విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఏసీబీ అధికారులు సైతం శశికళ వ్యవహారంపై విచారణ ముమ్మరం చేస్తున్నారు.

English summary
The Karnataka government on Monday transferred Bengaluru Central Jail chief superintendent Nikham Prakash Amrit IPS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X