వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు నెలల అబూ బతకాలంటే.. రెండు గుండె ఆపరేషన్లు వెంటనే చేయించాలి

Google Oneindia TeluguNews

అతను ఆరునెలల పసివాడు. పేరు అబూ బేకర్(బకేర్). అబూ గత నెల ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో నెలన్నరపాటు పుట్టుకతో వచ్చిన గుండెజబ్బుకి చికిత్స పొందుతూ గడిపాడు. అతను పుట్టుకతోనే వ్యాధితో బాధపడాల్సి వచ్చింది. అబూ గుండెలో, ఇంకా చుట్టూ ఉన్న రక్తనాళాలు సరిగ్గా అమరక, చిక్కుపడి ఉన్నాయి. వాటిని మూడు ఆపరేషన్లతో చిక్కు తీసి సరిగ్గా అమర్చాల్సి ఉంటుంది.

అలాంటి సమయంలో అబూ చాలా రోజుల పాటు జ్వరంతో అల్లాడుతున్నాడు. అలాగే న్యుమోనియాతో బాధపడుతున్నాడు. నొప్పితో విలవిలాడుతున్నాడు. సౌకర్యంగా శ్వాస తీసుకోలేకపోతున్నాడు. పాపం ఇప్పుడిప్పుడే పుట్టిన ఆ పసిగుడ్డును అతని తల్లి అపురూపంగా చూసుకుంటుంది. అబూ తల్లి చెంచాలో పాలను నోటివద్దకు తెచ్చి పెట్టినా కొన్ని చుక్కలు కూడా తాగలేని స్థితిలో అబూ ఉన్నాడు.

ఇంటి దీపం కోసం ఆ తల్లి తల్లడిల్లిపోతోంది

Support baby Abu Baker fighting against serious heart disease

అబూ తండ్రి, మహమ్మద్ ఇమ్రాన్ మొరాదాబాద్ లోని ఒక చిన్న ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. తన బిడ్డ చికిత్స కోసం ఆయన తాత్కాలికంగా భార్యతో కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. కుటుంబంలో సంపాదనాపరుడు ఆయనొక్కడే. పాల్ట్రీలో తన జీతం నెలకి రూ.10000 మాత్రమే వస్తాయి. ఆ డబ్బు కుటుంబ అవసరాలకు, అద్దెకే సరిపోతుంది. ఇక పొదుపు చేయటానికి అస్సలు అతని చేతిలో డబ్బు ఉండదు.

అబూ మొదటి ఆపరేషన్ కోసం ఇమ్రాన్ తన స్నేహితులను, బంధువుల వద్దకు వెళ్ళి డబ్బును సాయం చేయమని కోరాడు. తన బిడ్డను రక్షించటానికి సాయం చేయండని తనకు తెలిసిన వారందరినీ వేడుకున్నాడు. అలా 3.5లక్షలు పోగుచేసి, అబూ చికిత్స మొదలుపెట్టారు. మొదటి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. కానీ తర్వాత రెండు ఆపరేషన్లకి డబ్బు చాలట్లేదు.

అబూబాకర్‌కు సాయమందించండి, అతనికీ జీవించే హక్కు ఉంది

Support baby Abu Baker fighting against serious heart disease

ఇమ్రాన్ తన బిడ్డ చికిత్సకి ఎలా అయినా అన్నీ సమకూర్చటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. మరో 3.5లక్షలు పోగుచేయాలని ప్రయత్నిస్తున్నారు. అబూకి సర్జరీ తర్వాత కూడా సంరక్షణ, డాక్టర్ ని కలవడం, అబూ మామూలు పరిస్థితికి వచ్చే వరకు మందులు తీసుకోవడానికి చాలా ఖర్చవుతుంది.

ప్రతీ క్షణం శ్వాస తీసుకునేందుకు పోరాటమే చేస్తున్నాడు అబూబాకర్

అందువల్ల ఇమ్రాన్ ఆన్ లైన్ లో ImpactGuru.com పై విరాళాలకి అభ్యర్థన పెట్టారు. "నాకు తెలిసినవారందరి దగ్గరా నేను ఇదివరకే సాయం అడిగాను. నా అబూను రక్షించటానికి ఆఖరి ఆశ అపరిచితులైన మీ అందరి దయపై ఆధారపడివుంది. అందుకే నేను మా బాబు ఓపెన్ హార్ట్ సర్జరీలకోసం క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టాను." అంటూ ఇమ్రాన్ వేడుకుంటున్నాడు.

Support baby Abu Baker fighting against serious heart disease

అబూను రక్షించటంలో సాయం చేయటానికి, మీరు అతని ఫండ్ రైజర్ పై విరాళం ఇవ్వవచ్చు. లేదా అతని ఈ దీనగాథను షేర్ చేస్తే దయగల మహానుభావులు విరాళాలు ఇవ్వవచ్చు. అబూ కోసం మీవంతు సాయం చెయ్యండి. మీరు చేసే ఈ పని ఒక ప్రాణాన్ని నిలుపుతుంది.

అబూబాకర్‌కు జీవించే హక్కు ఉంది, అతనికి సాయమందించండి, ఓ ఇంటి దీపాన్ని నిలబెట్టండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X