వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ ఐరన్ లేడీ షర్మిల దీక్షకు 14 ఏళ్లు పూర్తి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మణిపూర్ ఐరన్ లేడీగా పేరున్న ఇరోమ్ షర్మిల నిరహార దీక్ష నిన్నటితో 14 ఏళ్లు పూర్తి చేసుకుని ఈరోజు పదహేనో ఏట ప్రవేశించింది. ఈ సందర్భంగా మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు, స్వచ్చంధ సంఘూలు, మానవ హక్కుల కార్యకర్తల పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దీక్ష చేయడానికి ప్రధాన కారణం
2000వ సంవత్సరం మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ వ్యాలీకి చెందిన మాలెం పట్టణంలో బస్‌ కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులపై భారత పారామిలటరీ దళాలు కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో అక్కడికక్కడే 10మంది పౌరులు చనిపోయారు. చనిపోయిన వారిలో 62ఏళ్ళ ముసలావిడ, 18ఏళ్ళ సినమ్‌ చంద్రమణి కూడా ఉన్నారు. సినమ్‌ 1988 జాతీయ బాలల బ్రెవరీ అవార్డు గ్రహీత.

Supporters express solidarity as Irom Sharmila's fast enters 15th year

ఇదేకాదు, సాయుధదళాలు నిత్యం మహిళలపై అత్యాచారాలు, ప్రజలపై ఎక్కడపడితే అక్కడ కాల్పులు జరపడం... ఇవన్నీ షర్మిల మనసును కలిచివేశాయి. అప్పటికి షర్మిల వయసు 28ఏళ్ళు. ప్రేమ కవితలు రాసుకుంటూ, అప్పుడప్పుడు సాయుధదళాలకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది.

ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఆగ్రహించిన ఆమె ఏఎఫ్‌ఎస్‌పీఏ-1958 (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ నవంబర్ 5న నిరవధిక నిరహార దీక్ష చేపట్టింది. దీక్ష ప్రారంభించిన రెండురోజుల్లోనే పోలీసులు షర్మిల ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణతో అరెస్టు చేశారు.

ఆమె దీక్షను భగ్నం చేయాలని పలు మార్లు పోలీసులు అరెస్టు చేయడం, వైద్యులు బలవంతంగా ఆమెకు పైపుల ద్వారా ద్రవాహారం ఇవ్వడం, విడదలయ్యాక తిరిగి ఆమె దీక్ష కొనసాగించడం.. ఇలా పద్నాలుగేళ్లుగా నిరాహార దీక్ష చేస్తూనే ఉంది.

"అక్క చిన్నప్పటి నుంచి ప్రతి గురువారం ఉపవాసం ఉండటం అలవాటు. అదే రోజు నిరాహారదీక్ష కూడా ప్రారంభించింది. ఇక ఈ నిరాహారదీక్ష తన డిమాండ్‌ సాధించుకునేంతవరకు ఆగేది కాదు" అంటూ షర్మిల సోదరుడు ఇరిమ్‌ సింగజిత్‌ అన్నారు.

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషన్‌ పవర్స్‌ యాక్ట్‌ చట్టం అంటే ఏమిటీ?

జమ్ము కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు బోర్డర్ రాష్ట్రాలు అవడం వల్ల చొరబాట్లు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలులో ఉంది. దీంతో భద్రతా బలగాలకు విచక్షణారహితమైన సర్వాధికారాలను ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషన్‌ పవర్స్‌ యాక్ట్‌ చట్టం (ఏఎఫ్‌ఎస్‌పిఏ) 1958లో కట్టబెట్టింది.

ఈ చట్టం ప్రకారం పోలీసులకు అనుమానం వస్తే ఎవరినైనా ఉగ్రవాది లేదా మిలిటెంట్‌ అని చెప్పి కాల్చి చంపవచ్చు. కాని, ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిన బలగాలు... అభంశుభం తెలియని వారిని సైతం నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు.

భద్రతా బలగాలకు విచక్షణారహితమైన సర్వాధికారాలను కట్టబెట్టడంతో వారి ఆగడాలకు, అత్యాచారాలకు అడ్డులేకుండా పోయింది. ఎంతోమంది మణిపూరీ మహిళలను రేప్‌ చేసి హత్య చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. షర్మిల నిరాహరదీక్ష చేస్తున్న సమయంలో మనోరమ అనే మహిళలను రేప్‌ చేసి హత్య చేశారు.

సాయుధ బలగాల కార్యాలయం దగ్గరే మనోరమ మృతదేహం పడి ఉండటంతో మణిపురి మహిళలు అగ్రహోదగ్రులయ్యారు. 13 మంది మధ్య వయసు మహిళలు వివస్త్రలుగా మారి "భారత సైనికులారా మమ్మల్ని రేప్‌ చేయండి" అంటూ ఆర్మీ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు.

English summary
Sit-in-protests, hunger strike and demonstrations joined by students, civil society organisations and human rights activists were held in Manipur to express solidarity with social activist Irom Chanu Sharmila whose fast demanding repeal of the AFSPA, 1958 from the state entered its 15th year.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X